పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస రోడ్ షోలు : ఏపీఈడీబీ సీఈవో సృజన





*పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస రోడ్ షోలు : ఏపీఈడీబీ సీఈవో సృజన


*


*మెట్ ఎక్స్ పో, ఇండియా కెమ్ 2022లకు 'ఈడీబీ' సన్నద్ధం*


*మంత్రులు, అధికారుల బృందంతో పాల్గొనే విధంగా ఏపీఈడీబీ ప్రణాళిక*


*వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీబీ ప్రతినిధుల బృందంతో సీఈవో సృజన తొలి సమీక్ష*


అమరావతి, అక్టోబర్, 28 (ప్రజా అమరావతి); పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస రోడ్ షోలు నిర్వహించనున్నట్లు ఏపీ ఈడీబీ సీఈవో సృజన వెల్లడించారు. నవంబర్ మొదటివారంలో ముంబయ్, ఢిల్లీ వేదికగా జరగనున్న మెట్ ఎక్స్ పో, ఇండియా కెమ్ -2022లలో పాల్గొనేందుకు సంసిద్ధంగా ఉండాలని  ఈడీబీ ప్రతినిధుల బృందాన్ని ఆమె ఆదేశించారు. ఈడీబీ ప్రతినిధుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ నెలలో  తైవాన్, జపాన్, దక్షిణ కొరియా దేశాలలో రోడ్ షోలు నిర్వహించే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషించేలా కలిసి ముందుకెళ్ళాలన్నారు. గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికిల్,లాజిస్టిక్  రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్ళలో రోడ్ షోలు, సమావేశాల ద్వారా కుదుర్చుకున్న 18 ఒప్పందాలకు సంబంధించి తదనంతర చర్యలపైనా సీఈవో ఆరా తీశారు.


నవంబర్‌ 2 నుంచి 3 వరకు ఢిల్లీ ప్రగతి మైదాన్‌ వేదికగా ఫిక్కి ఆధ్వర్యంలో కెమికల్స్‌-పెట్రోకెమికల్స్‌ రంగాలపై ‘ఇండియా కెమ్‌ -2022’’ పేరిట 11వ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ భాగస్వామ్య రాష్ట్రంగా చేరడంతో ప్రత్యేక స్టాల్స్‌, సీఈవో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, సెమినార్లలో పాల్గొనే అవకాశం లభించింది. వీటిని వినియోగంచుకోవడం ద్వారా విశాఖ-కాకినాడ పెట్రోలియం, కెమికల్స్ అండ్‌ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (పీసీపీఐఆర్‌)తో పాటు పీఎల్‌ఐ స్కీం కింద రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను ఏపీ ఈడీబీ అధికారులు వివరించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ నేతృత్వంలోని ఏపీ ఈడీబీ అధికారుల బృందం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సీఈవో తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు రెండు కీలక రంగాలకు చెందిన అంతర్జాతీయ బిజినెస్‌ ఎక్స్‌పోల్లో భాగస్వామ్యం అవుతున్నట్లు సీఈవో గుమ్మళ్ళ సృజన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్న ఇంజనీరింగ్‌-టెక్నాలజీ, కెమికల్స్‌-పెట్రో కెమికల్స్‌ రంగాలపై ముంబై, ఢిల్లీల్లో జరిగే అంతర్జాతీయ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం  పాల్గొంటుందన్నారు. ముంబైలో మెట్‌ 2022 ఎక్స్‌పో పేరిట మెటీరియల్‌, ఇంజనీరింగ్‌, టెక్నాలజీ రంగాల్లో ఇండియాలోని అవకాశాలను వివరించే విధంగా నాల్గవ ఎక్స్‌పో , నవంబర్‌ 2-4 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రక్షణ, రవాణా,విద్యుత్ రంగాలకు చెందిన 150కి మందికిపైగా పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఆల్రాటెక్, రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ, అక్జో నోబెల్‌, మహీంద్రా, టాటా స్టీల్‌ వంటి కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image