క్రీడలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వం



*తిరుమల తిరుపతి ఆల్  ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ పోటీలు ఘనంగా ప్రారంభించిన మంత్రి రోజా*


*ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్ర ప్రదేశ్ గా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే*


*క్రీడలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వం


*


*గ్రామ స్థాయి నుండి అన్ని పాఠశాలల్లో చదరంగం ఆటను ప్రోత్సహిస్తాం: మంత్రి  రోజా* 


తిరుపతి, అక్టోబర్ 29 (ప్రజా అమరావతి):  రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ విజయవాడ మరియు రాష్ట్ర చెస్ అసోసియేషన్ విజయవాడ వారి సంయుక్త ఆద్వర్యములో తిరుమల తిరుపతి  ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్  నేడు, రేపు జరుగుతున్న జాతీయ స్థాయి పోటీలను శ్రీనివాస స్పోర్ట్స్  కాంప్లెక్స్ తిరుపతి నందు  గౌ. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు  యువజన సర్వీసుల క్రీడా శాఖామాత్యులు ఆర్.కే.రోజా శాప్ వి.సి. అండ్ ఎం.డి. ప్రభాకర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. 


ఈ సందర్భంగా మంత్రి రోజా  మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని,  రాష్ట్ర ప్రభుత్వం  క్రీడలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నదని, ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్ర ప్రదేశ్ గా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదేనని అన్నారు. చదరంగం అనేది ఒక ఆట మాత్రమే కాదు  జీవితం కూడా ఒక చదరంగమే అని అందులో రాజు, మంత్రి, సిపాయి ఉన్నా మన జీవితంలో మనమే రాజు, మంత్రి, సిపాయి అన్నీ మనం తీసుకునే నిర్ణయమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని అందుకే ఆచి తూచి చదరంగంలో వలె జీవితంలో అడుగులు జాగ్రత్తగా  వేయాలని అన్నారు. ప్రతి విద్యార్ధి, విద్యార్థినులు అన్ని స్థాయిలలోని వారు చదరంగంపై మక్కువ పెంచుకునే విధంగా పాఠశాల స్థాయి నుండే చదరంగం ను పరిచయం చేసి, నిపుణులైన  కోచ్ లను ట్రైన్ చేసి వారిచే శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఆట వలన మెదడు చాలా చురుకుగా పనిచేసి చదువులో ముందు ఉండుటకు దోహదం చేస్తుందని, చెస్ అనేది మైండ్ తో ఆడే ఆట అని బలంతో కాదని అందుకే ఇందులో గెలిచిన వారిని గ్రాండ్ మాస్టర్ అంటారని అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చదరంగ భారతి కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించ బోతున్నామని అన్నారు. ఇందులో భాగంగా 33 మంది కోచ్ లను వర్చువల్ విధానంలో శిక్షణ ఇచ్చి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వీరు అందుబాటులో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ క్రీడలను అభివృద్ధి చేయడానికి యువతకు గ్రామీణ స్పోర్ట్స్ క్లబ్  లు, సిటీ స్పోర్ట్స్ క్లబ్ లు ఏర్పాటు మరియు గతంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్ నుండి డిసెంబర్ 21 వరకు యువతకు  కబడ్డీ వాలీబాల్ తదితర పోటీలు నిర్వహించి రూ.50 లక్షల ప్రైజ్  నిధులు కేటాయించి ప్రోత్సహిస్తున్నామని గౌ.ముఖ్యమంత్రి జన్మదినo నాటికి తుది గెలుపు పొందినవారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని అన్నారు. అనంతరం మంత్రి ఎడిఫై స్కూల్ చైర్ పర్సన్ సులోచన తో, పిల్లలతో చదరంగం ఆడారు.


జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆటల పోటీలలో గెలుపు ఓటములు సర్వసాధారణమని  పోటీలలో పాల్గొనడం ముఖ్యమని, ప్రతి ఒక్కరు  ఆట స్ఫూర్తితో ఆడాలని కోరారు.  ఈ  చెస్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గెలవడానికి ప్రయత్నించాలి అని ఓడిపోతే గెలిచినవారి నైపుణ్యాన్ని గమనించి వారి  సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ జాతీయ స్థాయి చెస్ పోటీలలో గెలిచినవారికి రూ.5 లక్షల విలువగల ప్రోత్సాహకాలు ఉన్నాయని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్న శాప్ మరియు ఆంధ్ర చెస్ అసోషియేషన్ విజయవాడ వారికీ ధన్యవాదాలు తెలిపారు.


    శాప్ వి.సి. మరియు ఎం.డి. మాట్లాడుతూ జగనన్న స్పోర్ట్స్  క్లబ్  యాప్ ను క్రీడా శాఖ  మంత్రి ప్రోత్సాహంతో ఏర్పాటు చేసి అందులో గ్రామీణ, పట్టణ  యువతకి ఆసక్తి కలిగిన ఆటలలో పాల్గొనుటకు పేర్లు నమోదు చేసుకునేలా చేసి, తద్వారా ఏ ఆటల పట్ల యువత ఆసక్తి కలిగి ఉన్నారో సమాచారం మేరకు వాటిని ప్రోత్సహించే దిశగా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని  అన్నారు.  నేటి ఈ పోటీలకు 10 రాష్ట్రాల నుండి  350 మంది, 100 మంది అంతర్జాతీయ రేటింగ్ కలిగిన క్రీడాకారులు, అంతేగాక 6 మంది అంతర్జాతీయ మాష్టర్లు ఈ పోటీలలో పాల్గొననున్నారని  మరియు శ్రీలంక దేశస్థుడు అనుభవజ్ఞుడు ఆటగాడు తమ పేర్లను నమోదు చేసుకున్నారని  తెలిపారు. ఈ పోటీలలో అండర్ 7,9,11,13,15 మరియు ఓపెన్, స్త్రీలు, విబిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు నమోదు చేసుకుని పాల్గొనవచ్చని అన్నారు. 


ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎ.పి. చెస్ అసోషియేషన్ శర్మ, ఎడిపై స్కూల్ చైర్ పర్సన్ సులోచన,  ఆర్బిటర్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ధర్మేంద్ర కుమార్, మాజీ టి.టి.డి. బోర్డ్ మెంబెర్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఎ.ఐ.ఎస్.ఎఫ్. డి.పి.అనంత, సి.ఈ.ఓ. సెట్విన్ మరియు డి.ఎస్.ఎ.  మురళీ కృష్ణ, ప్రవీణ్, ప్రసాద్, జ్వాలాముఖి తదితరులు పాల్గొన్నారు. 


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image