రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణ సౌకర్యం కల్పించి లక్ష్యాలను పూర్తి చేయాలి..
టిడ్కో గృహ రుణాలపై బ్యాంకర్లు, సచివాలయ కార్యదర్శులతో సమావేశం
.. కలెక్టర్ డా. మాధవీలత
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా అమలు చేస్తున్న ప్రాధాన్యత కార్యక్రమాలకు బ్యాంకర్లు అర్హులైన లబ్ధిదారులకు రుణ సహాయం అందించి లక్ష్యాలను పూర్తి చేయడంలో సహకరించాలని కలెక్టర్ డా. మాధవీలత బ్యాంకర్లకు సూచించారు.
సోమవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మాధవీలత, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ తో కలిసి బ్యాంకర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో టిడ్కో గృహాలకు, జగనన్న తోడు లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకు రుణాలు మంజూరు విషయంలో పూర్తిస్థాయి లో జిల్లాలో లక్ష్యాలు నెరవేరలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేయుచున్న ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతి గురువారం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిని పరిగణములోనికి తీసుకొని సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో అర్హులైన లబ్ధిదారులు అందరికి రుణ సౌకర్యం కల్పించి జిల్లాను అగ్రస్థానంలో నిలిపే విధంగాకృషి చేయాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ టిడ్కో, జగనన తోడు పథకాల పై బ్యాంకుల వారిగా లబ్ధిదారులకు మంజూరు చేసిన రుణాల మంజూరు పై సమీక్షించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో టిడ్కో, తదితర రుణాల మంజూరుకు సానుకూలం గా స్పందించిన, ఆ దిశలో జిల్లా పరిధిలోని బ్యాంకర్ల స్పందన రాకపోవడంతో లక్ష్యాలను సాధించడం కొంత వెనుకబడి ఉన్నామన్నారు. కొత్తగా జిల్లా ఏర్పాటు అయిన దృష్ట్యా మనది అనే భావన ఉంటే తప్పనిసరిగా జిల్లాకు కేటాయించిన లక్ష్యం సాధించడం సాధ్యం అవుతుందన్నారు. అధికారులతో సమన్వయం చేసుకోవాలని బ్యాంకర్ల ను కోరారు. పరస్పరం సమన్వయంతో జిల్లాను అభివృద్ధి చేయడం లో కలిసి పని చేద్దాం అని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం క్లస్టర్ వారీగా ప్రగతి అంశాల వారీగా సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మెప్మా పీడీ లీడ్ బ్యాంకు మేనేజర్, వివిధ బ్యాంక్ బ్రాంచ్ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment