ఏపీఐఐసీ' వీసీ, ఎండీగా తొలి సమీక్ష నిర్వహించిన డాక్టర్ నారాయణ భరత్ గుప్తా



*'ఏపీఐఐసీ' వీసీ, ఎండీగా తొలి సమీక్ష నిర్వహించిన డాక్టర్ నారాయణ భరత్ గుప్తా


*


*ఏపీఐఐసీ కీలక ప్రాజెక్టులు,  పనులు వాటి పురోగతిపై ఆరా*


అమరావతి, అక్టోబర్, 04 (ప్రజా అమరావతి); ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఏపీఐఐసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షలో ఏపీఐఐసీ కీలక ప్రాజెక్టులు, పనుల పురోగతిపై  అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, క్రిస్ సిటీ, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, ఎంఎస్ఈ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కుల ప్రతిపాదనలు, ఎన్టీఆర్ జిల్లాలోని మల్లవల్లి ఫుడ్ పార్క్, ప్రకాశం జిల్లా నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ & మానుఫాక్చరింగ్ జోన్ , మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, పీఎం గతిశక్తి కింద చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి గురించి ఉన్నతాధికారులు వీసీ,ఎండీ భరత్ గుప్తాకి వివరించారు. ఆన్ లైన్, డాష్ బోర్డు, ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకునే సాంకేతిక వ్యవస్థ గురించి ఎండీ ఆరా తీశారు. పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలకు అందించే సేవలు, సదుపాయాలు, ఈవోటీ, ఆన్ లైన్ బిల్లు చెల్లింపుల ప్రక్రియ గురించి అధికారులతో చర్చించారు. అంతకుముందు  ఏపీ ఈడీబీ సీఈవోగా ఏపీఐఐసీ వీసీ ఎండీ భరత్ గుప్తాని నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో ఏపీఐఐసీ అధికారులు అభినందనలు తెలిపారు.  క్రిస్ సిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ బాద్యతలనూ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు  సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్, ఓఎస్డీ నాగిరెడ్డి(వీసీ,ఎండీ), సీజీఎం (అసెట్ మేనేజ్ మెంట్) ఎల్.రామ్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రసాద్,కంపెనీ సెక్రటరీ శివారెడ్డి, సీజీఎం (పర్సనల్) జ్యోతి బసు,  చీఫ్ ఇంజనీర్ వివేకనందరెడ్డి, సీనియర్ ఇంజనీర్ నాగరాజు, జనరల్ మేనేజర్లు శరత్ బాబు, గెల్లి ప్రసాద్, నాగ్ కుమార్, మణిభాస్కర్, అములోద్భవి, తదితులు పాల్గొన్నారు.



Comments