ముదివర్తి-ముదివర్తిపాళెం పెన్నానది వద్ద కాజ్వే నిర్మాణం పై స్పెషల్ స్టొరీ :
ఈ నెల 27 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారిచే ముదివర్తి-ముదివర్తిపాళెం పెన్నానది వద్ద కాజ్వే నిర్మాణానికి శంఖుస్థాపన
* అంచనా విలువ: రూ. 93.32 కోట్లు (ఫేజ్ -1)
పెన్నా నదికి కుడి, ఎడమవైపు గల ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లోని గ్రామాల మద్య దూరాన్ని తగ్గించడంతో పాటు కనెక్టివిటీని కల్పించేందుకు, పెన్నా నది ఎగువకు సముద్రం వెనుక నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా భూగర్భ జలాల్లో లవణీయతను నిరోధించడానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, విడవలూరు మండలం ముదివర్తి మరియు ముదివర్తిపాలెం గ్రామాల మధ్య పెన్నా నది మీదుగా సబ్‌మెర్జిబుల్ కాజ్ వే నిర్మాణాన్ని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మొదటి దశలో 93.32 కోట్ల రూపాయల అంచనాలతో జలవనరుల శాఖ ద్వారా కాజ్వే నిర్మాణం చేపట్టడం జరుగుతుంది.
కాజ్వే నిర్మాణం ముఖ్య ఉద్దేశ్యం:
........................
* కాజ్‌వే U/s వద్ద ఉన్న ఆయకట్టు భూముల్లోకి ఉప్పునీరు చొరబడకుండా నిరోధించడం.
* మంచినీరు/నదీ జలాలతో భూగర్భ జలాల పట్టిక పెరుగుతుంది.
* పెన్నా నదికి కుడి, ఎడమవైపు గల ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లోని గ్రామాల మద్య దూరం 20 కి.మీ మేర తగ్గడంతో పాటు కనెక్టివిటీని కల్పించడం.
ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు:
..........................
సబ్‌మెర్సిబుల్ కాజ్‌వే మొత్తం పొడవు 1400మీ.
వరద నీరు విడుదల-7.0 లక్షల క్యూసెక్కులు
గరిష్ఠ వరద స్థాయి-3.80
addComments
Post a Comment