శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
రాష్ట్రఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవాదాయశాఖ మంత్రివర్యులు అయిన శ్రీ కొట్టు సత్యనారాయణ ఆలయములో జరుగుచున్న ఆలయ అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేవస్థానం నకు కేటాయించిన రూ.70 కోట్లకు సంబందించిన పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గౌరవ మంత్రివర్యుల వారికి సదరు పనుల గురించి ఆలయ ఇంజినీరింగ్ అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ , దేవాదాయశాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీ ఎస్.శ్రీనివాస్ , దేవాదాయ శాఖ స్థపతి శ్రీ పరమేశ్వరప్ప , ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీ కె.వి.ఎస్ కోటేశ్వరా రావు ,
పాల్గొన్నారు. అనంతరం మంత్రివర్యుల వారు ఆలయ అధికారులకు కొన్ని సూచనలు చేశారు.
addComments
Post a Comment