వ్యవసాయంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్*
*: జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా - పిఎం కిసాన్ కింద 2,68,904 మంది రైతులకు రూ.110.54 కోట్ల లబ్ధి*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
*: రైతుల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం జగన్ - హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్*
పుట్టపర్తి, అక్టోబర్ 17 (ప్రజా అమరావతి): రైతు దేశానికి వెన్నెముక అని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి లోని సాయి ఆరామం లోని రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.ఆర్.రైతుభరోసా - పి.ఎం.కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని రైతులు, ఇస్తున్న నాల్గవ విడత ఆర్ధిక సహాయాన్ని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీటనొక్కి నిదులు విడుదల చేశారు.జిల్లాలో సోమవారం పుట్టపర్తి లోని సాయి ఆరామం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ, జడ్పీ చైర్మన్ బోయ గిరి జమ్మ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రానున్న రబీ సీజన్ ఆరంబానికి ముందు.. రైతులకు సాగుబడి ఖర్చుల కోసం.. ఆర్థిక సాయం అందివ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. వరుసగా 4వ ఏడాది రెండవ విడత సాయంతో.. ఖరీఫ్ సీజన్ కు లబ్ధిదారుల సంఖ్య కూడా పెరగడం, సాగుబడి కూడా అనూహ్యంగా పెరగడం, దిగుబడులు కూడా చేతికి అందే దశకు చేరుకోవడం జరిగిందన్నారు. అర్హత ఉండీ "వైఎస్ఆర్ రైతు భరోసా" పథకం లబ్ది ఇంకను పొందని వారుంటే.. సంబందిత వార్డు లేదా గ్రామ వాలంటీర్లను, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను, మండల వ్యవసాయ అధికారిని గానీ సంప్రదించాలన్నారు. ఈ క్రాఫ్ట్ నమోదు ప్రక్రియ నందు జిల్లాలో వంద శాతం జరగాలి. ఒక పంట బదులు మరి ఒక పంట నమోదు చేయకూడదు గతంలో జరిగిన తప్పులు పునరావతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత మన పైన ఉన్నదని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ముందుకు రావు. రైతులు వేసిన పంట మాత్రమే నమోదు చేయాలని అప్పుడే వ్యవసాయ ప్రగతిలో స్పష్టమైన మార్పు వస్తుందని తెలిపారు. నేను ఇటీవల రామగిరి కొత్తచెరువు మండలాలలో 300 మంది రైతులు పంట నమోదు ప్రక్రియ ఎలాచేపట్టారు పరిశీలించడం జరిగిందని తెలిపారు
*ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. జగనన్న సీఎం అయిన తర్వాత వర్షాలు బాగా కురుస్తున్నాయని, రైతులు బాగా వ్యవసాయాన్ని చేసుకుంటున్నారని, వలస వెళ్లిన రైతులు కూడా తిరిగి వచ్చారన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్దకే విత్తనాలను, ఎరువులు, పురుగుమందులను అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో రైతులను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు
అనంతరం ప్రముఖుల చేతుల మీదుగా రైతులకు మెగా చెక్కును పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పుర ప్రముఖులు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment