కొవ్వూరు (ప్రజా అమరావతి);
* ఖరీఫ్ సిజన్లో ధాన్యాన్ని ఆర్బికేలు ద్వారా రైతుల కల్లాల్లోనే కొనుగోలు చేసే విధంగా చర్యలు.
* జిల్లాలో దళారులకు తావు లేకుండా రైతుకు మద్దతు ధర ను అందించి రైతులకు అండ గా నిలుద్దాం.
రైతుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ 1902, 155251 నంబర్లను సమాచారం ఇవ్వండి.
.. జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్
జిల్లా లో 2022-23 ఖరీఫ్ సీజన్ కు ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ మేరకు అక్టోబర్ 4వ వారంలోగా నిర్దేశించిన అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి హెచ్ శ్రీధర్ స్పష్టం చేశారు.
శనివారం స్థానిక సాయి కళ్యా ణ మండపం లో జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రి యపై నియోజకవర్గం లోని అధికారు లకు, టెక్నికల్ అసిస్టెంట్లు, ప్రొ క్యూర్‌మెంట్ అసిస్టెంట్లు, రూట్ అసిస్టెంట్లు, విఏఏఎస్ లకు శిక్షణ తరగతులు కార్యక్రమం లో జే సి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లా డుతూ అక్టోబర్ 4వ వారం లోగా జిల్లా లోని నిర్దేశించిన అన్ని ఆర్బీకె కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చాలన్నారు. ఈ మేరకు టెక్నిక ల్ అసిస్టెంట్లు, ప్రొక్యూర్‌మెంట్ అసిస్టెంట్లు, రూట్ అసిస్టెంట్లు ధాన్యం కొనుగోలు పక్రియ పై పూర్తి స్థాయి శిక్షణ అందిచామ న్నారు. ధాన్యం సేకరణ లో ఎంఏఒఎస్, కస్టోడియన్ ఆఫీ సర్లు, విఆర్ఓలు, ఏడిఏ లదే పూర్తి భాద్యత అన్నారు. రైతు లు దళారుల బారినపడి మోస పోకుండా ప్రభుత్వం ప్రకటిం చిన మద్దతు ధరను చెల్లించి వారికి అండగా నిలుద్దామ న్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నష్టపోకుండా ధాన్యం కొనుగో లు ప్రక్రియలో రాష్ట్ర ముఖ్య మంత్రి నూతన విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ధాన్యం సేకరణ సమయంలో సాంకేతిక సహాయకులు నాణ్యత ప్రమా ణాలు కనుగుణంగా ఇచ్చిన దృవపత్రం ఈ ప్రక్రియలో అత్యంత కీలకమన్నారు. రైతు వద్ద ధాన్యం సేకరణ నుండి వే బ్రిడ్జి వెళ్లే వరకు ఆ రైతు ధా న్యం ఏ మిల్లుకు వెళుతుందో తెలియదు కనుక ఎటువంటి అవకతవకులు జరిగేందుకు అవకాశం లేదన్నారు. ప్రతి వే బ్రిడ్జి వద్ద 4 నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో
లేబర్, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ప్రతి రైతు నుండి దాన్ని కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్ బి కే సాంకేతిక సిబ్బంది రైతు కళ్ళల్లోనే ధాన్యం నాణ్యతను పరిశీలించటం జరుగుతుంద న్నారు. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయడం జరుగుతుందన్నారు.
ధాన్యం కొనుగోలు సమయ ములో పూర్తి పారదర్శకతతో రైతుకు మద్దతు ధరను అందిం చడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చెయ్యాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబ ర్1902, మరియు 155251 నంబర్లకు ఫిర్యాదు చెయ్యవొచ్చునని అన్నారు.
నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యానికి కనీస మద్దతు ధర.. సాధారణ రకం (కామన్) 75 కేజీలకు రు.1530/- గ్రేడ్ 'ఏ ' రకం 75 కేజీలకు రు.1545/- ను చెల్లించడం జరుగుతుందన్నారు.
నియోజకవర్గ పరిధిలో గల సాంకేతిక సహాయకులకు, ఎంఏఓలు, ఏడిఏలు, కస్టోడి యన్ అధికారులకు, డిప్యూటీ తాసిల్దార్లు, రెవిన్యూ ఇన్స్పెక్ట ర్లు, వీఆర్వోలు, వీహెచ్ఏ లు, విఎఫ్ఏలు,వాలంటీర్లకు శిక్షణ అందించమన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీవో ఎస్. మల్లిబాబు, ఇంఛార్జి డిఎం సివిల్ సప్లై జి.త్రినాథ స్వామి, డిఎస్ఓ ప్రసాదరావు, సాంకేతిక సహా యకులకు, ఎంఏఓలు, ఏడి ఏలు, కస్టోడియన్ అధికారులు డిప్యూటీ తాసిల్దార్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, వీఆర్వోలు, వీహె చ్ఏ లు, విఎఫ్ఏలు, వాలం టీర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment