ఇంద్రకీలాద్రి: అక్టోబర్ 3 (ప్రజా అమరావతి);
*విజయదశమి రోజున కృష్ణ నదిలో తెప్పోత్సవం వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది*
*ఆ రోజు రూ.500 క్యూ లైన్ తప్ప, మిగతా అన్ని క్యూ లైన్లో ద్వారా ఉచిత దర్శనానికి అనుమతిస్తాం.*
*దివ్యాంగులు వారికి నిర్దేశించిన సమయంలోనే దర్శనానికి రావాలి..*
. *.... రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.*
సోమవారం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ శరన్నవరాత్రుల్లో ఎనిమిదవ రోజున అమ్మవారు శ్రీ దుర్గా దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారన్నారు. మూలా నక్షత్రం రోజున రెండున్నర లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. చివరి భక్తుల వరకు ప్రతి ఒక్కరికి సంతృప్తికరమైన దర్శనం అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భక్తుల దర్శనం కోసం ఏర్పాటుచేసిన ఐదు క్యూ లైన్ లో నాలుగు క్యూలైన్లను ఉచిత దర్శనానికి నిర్దేశించడం జరిగిందని, రూ.500/- క్యూలైన్ ను మాత్రం టికెట్టు కొన్నవారికి మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ముందుగా ఆన్లైన్లో టికెట్ పొందేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. నవరాత్రులలో ఆఖరి రోజు నుండి భవానీలు దర్శించుకునేందుకు వస్తారని ఇందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తెప్పోత్సవం నదిలో నడిపేందుకు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నదిలో నీటి ప్రవాహాన్ని బట్టి ఇరిగేషన్ అధికారులు అనుమతులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే శాస్త్ర ప్రకారం పూజలు చేసి నది ఒడ్డు నుండే దర్శనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 వరకు దివ్యాంగులకు దర్శనానికి కేటాయించడం జరిగిందని ఆ సమయాలలో మాత్రమే దివ్యాంగులు దర్శనానికి వచ్చి సహకరించాలన్నారు. వారికి మోడల్ గెస్ట్ హౌస్ నుండి బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ , రెవెన్యూ, మున్సిపల్, మీడియా, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో నేటి వరకు ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతున్నాయని, ఇదేవిధంగా ఉత్సవాలు విజయవంతం చేయడానికి కృషి చేయాలని మంత్రి కోరారు.
addComments
Post a Comment