మంగళగిరి లో ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నాను.

 అమరావతి/మంగళగిరి (ప్రజా అమరావతి);


తాడేపల్లి పట్టణంలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్._


అనంతరం మీడియాతో నారా లోకేష్ మాట్లాడుతూ..


 మంగళగిరి లో ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నాను.



 మంగళగిరి నియోజకవర్గంలో 

12 సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. 


 స్వర్ణకారుల సంక్షేమం కోసం లక్ష్మి నరసింహ స్వర్ణకార సంక్షేమ సంఘం ఏర్పాటు చేసాను.


 నియోజకవర్గంలో పెళ్ళిలు జరిగితే పెళ్లి కానుక ఇస్తున్నాం.


 పురోహితులకు, పాస్టర్లకు, ఇమామ్, మౌజమ్లకు పండుగ కానుకలు ఇచ్చాం.


 కోవిడ్ సమయంలో వైద్య సహాయం అందించాం.


 మంగళగిరి, తాడేపల్లి లో

అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం.


 ప్రభుత్వం చేతగాని తనం వలన రోడ్లు వెయ్యకపోతే నేను కొన్ని గ్రామాల్లో గ్రావెల్ రోడ్లు వేసాను.


 వికలాంగులకు ట్రై సైకిళ్లు, స్వయం ఉపాధి కోసం 300 తోపుడు బల్లు, టిఫిన్ బల్లు, ఇస్త్రీ బల్లు అందించాం.


 కృష్ణా నది పక్కనే ఉన్నా నియోజకవర్గం లో తాగునీటి సమస్య అలానే ఉంది. 


 జలధార కార్యక్రమం పెట్టి ట్యాంకర్ల ద్వారా ఉచితంగా త్రాగునీరు అందించాం. కొన్ని గ్రామాల్లో త్రాగునీటి ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం.


 స్తీ శక్తి కార్యక్రమం ద్వారా టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం.


 మంగళగిరి యువత కు యువ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ లో ఉచితంగా సాప్ట్ వేర్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం.


 ఎన్టీఆర్ సంజీవని కార్యక్రమం ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం.


 దుగ్గిరాల లో ఎన్టీఆర్ సంజీవని వైద్య రథం, మంగళగిరి, తాడేపల్లి లో ఎన్టీఆర్ సంజీవని వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశాం.

 

 ఇప్పటి వరకూ 10 వేల మంది పేదలకు వైద్య సహాయం అందించాం.


 త్వరలో 15 రోజులకు ఒక సారి మా నాయకులను ఇంటికి పంపి బిపి, షుగర్ కి మందులు ఉచితంగా అందజేస్తాం.


 ప్రతిపక్షంలో ఉండి ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా.


 అధికారంలో ఉంటే ఇక నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ది చేస్తానో ప్రజలు ఆలోచించాలి.


 రెండు సార్లు ప్రజలు గెలిపించినా ఎమ్మెల్యే ఆర్కే గారు నియోజకవర్గాన్ని అభివృద్ది చెయ్యడం లేదు.


 నేను అడిగే ప్రశ్నలకు స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి.


 టిడిపి హయాంలో నిధులు కేటాయించి శంకుస్థాపన చేసిన తాగునీటి పథకాన్ని ఎందుకు ఆపేశారు?


 అటవీ భూముల్లో ఉన్న ఇళ్లకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చి ఎందుకు నెరవేర్చలేదు?


 పేదల ఇళ్లు ఎందుకు కూల్చారు? 


 ప్రభుత్వం రూ.2500 కోట్ల అభివృద్ది నిధులు కేటాయిస్తే ఒక్క రూపాయి తెచ్చుకోలేని చేతగాని ఎమ్మెల్యే ఆర్కే.


 సీఎం ఇంటి పక్కన ఉండే బ్రిడ్జ్ కట్టలేని దుస్థితి. 6 కోట్లు ఖర్చు చేస్తే కొత్త బ్రిడ్జ్ నిర్మించే అవకాశం ఉన్నా 3 కోట్లతో రిపేర్లు చేసినా అక్కడ పరిస్థితి మారలేదు.


 నియోజకవర్గంలో టిడిపి కట్టిన టిడ్కో ఇళ్లకు రంగులు వేసుకోవడం తప్ప పేదలకు ఒక్క ఇళ్లు కట్టలేదు.


 నియోజకవర్గంలో పేదలకు

10 వేల ఇళ్లు కట్టాల్సిన అవసరం ఉంది.


 తాడేపల్లి గంజాయి కి అడ్డగా మారినా చర్యలు లేవు.


 గంజాయి మత్తు లో మృగాళ్లు, కృష్ణా నది ఒడ్డున మహిళ ను అత్యాచారం చేశారు. ఇప్పటి వరకూ ఆ కుటుంబానికి న్యాయం చెయ్యలేదు.


 రైల్వే భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు అక్కడే పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన ఆర్కే ఎందుకు మాట తప్పారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే వారికి నోటీసులు ఎందుకు వెళ్ళాయి.


 గెలిచిన వెంటనే యూ 1 జోన్ ఎత్తేస్తాం అన్నారు. ఇప్పుడు 2 శాతం పన్ను కట్టాలి అని వేధిస్తున్నారు ఎందుకు?


 డంప్ యార్డ్ తొలగిస్తానన్న హామీ ఏమయ్యింది? 


 నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పారిశుధ్యం లోపించింది, పందులు తిరుగుతున్నాయి.


 అభివృద్ది కార్యక్రమాల్లో భారీ అవినీతి జరుగుతుంది.


 ఇసుక లో ఎమ్మెల్యే భారీగా అవినీతికి పాల్పడుతున్నారు.


 దమ్ముంటే మంగళగిరి నియోజవర్గంలో టిడిపి, వైసిపి హయాంలో జరిగిన అభివృద్ది పై శ్వేత పత్రం విడుదల చెయ్యాలి.


 పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? 


 ప్రజా సమస్యల పై పోరాడటమే తప్పా?


 పవన్ వ్యాఖ్యల్లో తప్పేముంది? 


 మహిళల్ని అగౌరవపరుస్తూ వైసిపి నేతలు మాట్లాడినప్పుడు సిఎం చర్యలు తీసుకోకపోగా... నవ్వుతూ ఎంజాయ్ చేశారు.


 టిడిపి, జనసేన కలిసి ప్రజా సమస్యల పై పోరాడతాం.


 విశాఖ లో ఎంపి ఎంవివి, విజయసాయి రెడ్డి మధ్య వాటాల్లో తేడా వచ్చింది కాబట్టే భూ కుంభకోణాలు బయటపెట్టుకున్నారు.


 దస్పల్లా భూములు విజయసాయి రెడ్డి కొట్టేసాడు.


 టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు లోకేష్ దస్పల్లా భూములు కొట్టేసాడు అని ఆరోపణలు చేశారు.


 దస్పల్లా భూములు పై సీబీఐ ఎంక్వయిరీ వేసే దమ్ము జగన్ రెడ్డి కి ఉందా?


 జగన్ కోరిక, డిమాండ్స్ మేరకే మేము అమరావతి ని రాజధానిగా ఎంపిక చేశాం.


 ఇప్పుడు ఆయన మాట తప్పి, మడమ తిప్పాడు.


 ఎన్నికల ముందు ఇక్కడే రాజధాని అన్న కరకట్ట కమల్ ఇప్పుడు ఇక్కడ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు.


 అభివృద్ది చేతగాక మూడు రాజధానులు అని విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.


 వైసిపి ఎంపి అమరావతి రైతులకు చెప్పు చూపించి దాడి చేయించాడు. ఆ ఎంపీ కి ఒళ్లు బలిసింది.


 అలాగే దాడి చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు గారి పై మాట్లాడిన మాటలకు జగన్ హైదరాబాద్ నుండి ఆంధ్రా లో అడుగు పెట్టే వాడా? పాదయాత్ర చెయ్యగలిగేవాడా?


 రైతులను అవమానించిన వారికి శాపం తగలడం ఖాయం. 


 ఇసుక, అక్రమ మద్యం దందా లో జగన్ దోపిడి రోజుకి నాలుగు కోట్లు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ముఖ్య నేతలు.

Comments