ఆం.ప్ర రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ రాక
తిరుపతి, అక్టోబర్22 (ప్రజా అమరావతి): తిరుపతి, తిరుమల ఐదు రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయం కు శనివారం మధ్యాహ్నం 1.45 గం. లకు చేరుకున్న గౌ ఆం.ప్ర రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ మంధాత సీతా రామ మూర్తి కి జిల్లా సాంఘిక సంక్షేమ సాధికార అధికారి చెన్నయ్య, ఈ డి ఎస్సీ కార్పొరేషన్ అధికారి నర్సింహులు పుష్ప గుచ్ఛాలు అందచేసి సాదర స్వాగతం పలికారు.
అనంతరం చైర్ పర్సన్ కుటుంబ సమేతంగా స్థానిక పద్మావతి అతిథి గృహం చేరుకుని తిరుమలకు శ్రీవారి దర్శనార్థం బయలు దేరి వెళ్ళారు.
addComments
Post a Comment