ఆక్వా సెక్టార్ ఇప్పుడు దేశానికీ గ్రోత్ ఇంజిన్ లాంటిది



విజయవాడ (ప్రజా అమరావతి);



*ఆక్వా సెక్టార్ ఇప్పుడు దేశానికీ గ్రోత్ ఇంజిన్ లాంటిది


*

*నవంబర్ 4, 5, 6 తేదీల్లో భీమవరంలో ఆక్వా ఎక్స్ ఇండియా 2022 నిర్వహణ*

*ఆక్వారంగంలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది.*

*ఈ నెల 28న షిషరీస్ వర్సిటీకి సీఎం వై.ఎస్. మోహన్ రెడ్డి శంకుస్థాపన*.. 

*మంత్రి సీదిరి అప్పల రాజు వెల్లడి*..


దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ నుంచి 70 శాతం మత్స్య సాగు ఉత్పత్తి  అవుతోందని, ముఖ్యమంత్రి వై.ఎస్.  జగన్ మోహన్ రెడ్డి ఆక్వా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఆక్వా రంగంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించి సన్న, మధ్యతరహా రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో విద్యుత్ సరఫరా సబ్సిడీ పై ఇస్తున్నారన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన ఆక్వా ఎక్స్ ఇండియా 2022 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవంబర్ 4, 5, 6 తేదీల్లో భీమవరం ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆక్వా రంగానికి మేలు జరిగేలా ఫిషరీస్ వర్శిటీని అందుబాటులోకి తెస్తున్నామని, ఈ నెల 28న ఫిషరీస్ వర్శిటీకి సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఆక్వా సెక్టార్ ఇప్పుడు దేశానికీ గ్రోత్ ఇంజిన్ లాంటిదని అన్నారు. దేశం మొత్తం మీద 70 శాతం ఆక్వా కల్చర్ ఆంధ్రప్రదేశ్  నుంచే ఉంటోందని తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా రంగం పై 17 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రంగంలో కూడా ఏపి సీడ్ యాక్ట్ వంటి సంస్కరణలు  తీసుకొచ్చిందన్నారు. ఆక్వా రంగానికి జగనన్న ప్రభుత్వం అన్ని విధాల చేయూత అందిస్తోందని, షిషరీస్ వర్సిటీని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని, నక్కపల్లి దగ్గర ఆక్వా కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలు దేశానికే కాక, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి తెలిపారు. రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, సీఎం వై.ఎస్. జగన్‌ దార్శనికత, ఆలోచనలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలవుతున్నాయని.. ఇథియోఫియా దేశంలో కూడా ఆర్బీకేల ఏర్పాటు సన్నద్దమవుతున్నాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి పంట విక్రయం వరకూ ఎలాంటి సేవలు అందుతున్నాయో.. అలాగే ఆక్వారంగంలో కూడా అటువంటి సేవలు అందేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. భీమవరంలో నిర్వహించే ఆక్వా ఎక్స్ సదస్సు ఆక్వా రైతులకు మంచి దిక్సూచిలా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎన్. సందీప్ వర్మ, ఏ. జ్ఞాన ప్రకాష్ లను మంత్రి అభినందించారు. ఆక్వా రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం  సాగులో ఇబ్బందులు పరిష్కరించే విధంగా, ఆక్వా రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలపై ఆక్వా రైతులు అవగాహన కల్పిస్తామన్నారు.


క్షత్రియ కార్పోరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు మాట్లాడుతూ... జగనన్న ప్రభుత్వంలో 10 ఎకరాలలోపు  ఆక్వా రైతులందరికీ విద్యుత్ యూనిట్ కి రూపాయి యాబై పైసలకే అందివ్వడం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆక్వా రంగంలో అవగాహన కోసం ఆక్వా ఎక్స్ ఫో నిర్వహించడం అభినందనీయమన్నారు. టైగర్, ఒనామి తర్వాత ఇఫ్పుడు మరో కొత్తరకం సీడ్ తీసుకురావాల్సిన అవసరం ఉందని.. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతుల తరపున సర్రాజు విజ్ఞప్తి చేశారు. 


ఈ కార్యక్రమంలో ఆఫ్కాఫ్ ఛైర్మన్ అనిల్ బాబు, వడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ గాయత్రి సంతోషిని,  ఆక్వా ఎక్స్ ఇండియా సీఈవో వేణు దంతులూరి, సోసైటీ ఇండియన్ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్ (సైఫా) అధ్యక్షులు వి. రామచంద్ర రాజు, ఆక్వా ఎక్స్ డైరెక్టర్లు సమీర్ పాత్ర, ఎన్. సందీప్ వర్మ, ఏ. జ్ఞాన ప్రకాష్, పలువురు ఆక్వా ఎక్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image