చేనేత రంగానికి సంబంధించిన కార్మికులు సంఘాలుగా ఏర్పడాలి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

 చేనేత  రంగానికి సంబంధించిన కార్మికులు సంఘాలుగా ఏర్పడాలి

జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్



  సోమేందపల్లి, అక్టోబర్ 28 (ప్రజా అమరావతి):  చేనేత రంగానికి సంబంధించిన కార్మికులు  సహకార సంఘాల సమైక్యలుగా ఏర్పడాలి అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. శుక్రవారం సోమందపల్లి సరస్వతి మండల మహిళ పరస్పర సహాయక సహకార సంఘాల కార్యాలయంలోని  సమావేశ మందిరంలో చేనేత మరియు   జౌళి శాఖ శ్రీ సత్య సాయి జిల్లా సౌజన్యంతో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు  ముద్ర పథకం కింద మెగా చెక్కు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా   లబ్ధిదారులకుపంపిణీ  చేశారు.ఈ కార్యక్రమంలో , రీజినల్ మేనేజర్   లారెన్స్, శ్రీ సత్య సాయి జిల్లాలీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీ సాయినాథ్ రెడ్డి,  అనంతపురం జిల్లా కెనరా బ్యాంక్ మేనేజర్  రాంప్రసాద్ రెడ్డి,  సంబంధిత అధికారులు  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేతరంగానికి  రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్తిస్తూ  ఇస్తూ ఉన్నదని తెలిపారు.  ప్రతి ఒక్కరు  చేనేత వస్త్రాన్ని ధరించాలి. దేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం ఆధారపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో చేనేత జౌళి రంగంలో, నేను అనేక హోదాలలో పనిచేయడం జరిగిందని  తెలిపారు. సుమారు 15  సంవత్సరాలలో పని చేయడం జరిగిందని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైయస్సార్  నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి కార్మికుడికి సంవత్సరానికి 24 వేల రూపాయలు  అందజేయడం జరుగుతూ ఉందని తెలిపారు, చేనేత కార్మికులకు పింఛన్ కూడా అందజేయడం జరుగుతూ ఉందని తెలిపారు. ముద్ర పథకం ద్వారా  సుమారు5 కోట్ల వరకు   వివిధ బ్యాంకులో రుణ పరపతి చేనేత కార్మికులకు అందజేయడం జరుగుతూ ఉందని తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లాలో ధర్మవరం పట్టు చీరలకు ప్రపంచ  వ్యాప్తంగా మంచి  గుర్తింపు ఉన్నదని తెలిపారు. రాబోయే తరం వారికి చేనేత కళలపై  విశిష్టతను గురించి తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలిపారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఐదు లక్షల మగ్గాలు ఉన్నాయని ప్రస్తుతం అనంతరం 53,000 మగ్గాలు ఉన్నాయని   గణాంకాలుచెబుతున్నాయని తెలిపారు. చేనేతులలో మంచి మార్పు రావాలి సంఘాలకు ఏర్పడి అభివృద్ధి చెందాలని చేనేత కార్మికులకు పిలుపునిచ్చారు. అనంతరం లబ్ధిదారులకు  ఎస్ హెచ్ జి  68 గ్రూపులకు 6 కోట్ల 72 లక్షల రూపాయలు మెగా  చెక్ మరియు  చేనేతరంగా సంబంధించిన కార్మికులకు 200 మందికి 1  కోటి ఐదు లక్షల రూపాయలు మెగా  చేక్కును  పంపిణీ చేశారు.

 ఈ కార్యక్రమంలో   డిఆర్ డి ఏ పి డి నరసయ్య, జిల్లా చేనేత కార్మిక శాఖ  ఏడి రమేష్, ఎమ్మార్వో మురళీకృష్ణ, ఎంపీడీవో వెంకటేశ్వర, బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు తదితరులు  పాల్గొన్నారు.

 

Comments