స్పందన, ఇతర ఫిర్యాదుల పరిష్కారం చేసిన తదుపరి క్షేత్ర స్థాయి సంబందించిన అంశానికి చెందిన ఫోటో అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది




రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


స్పందన, ఇతర ఫిర్యాదుల పరిష్కారం చేసిన తదుపరి క్షేత్ర స్థాయి సంబందించిన అంశానికి చెందిన ఫోటో అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంద


ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలు చేయడం లో జిల్లా కలెక్టర్ లు వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం అన్నారు. ప్రతి ఆర్డీవో, సంబందించిన జిల్లా అధికారులు కూడా ప్రతి రోజు ఆయా శాఖల పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారం, అనంతరం క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది అప్లోడ్ చేసిన డేటా ఖచ్చితంగా పరిశీలన అవసరం అని స్పష్టం చేశారు. అప్పుడే ప్రభుత్వం ఆశించిన మేర ప్రజా సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.




గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ , పంచాయతీ రాజ్, సిసిఎల్ఏ ఉన్నతాధికారులు ఆయా  శాఖా పరమైన ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో  గ్రామ వార్డ్ సచివాలయ సేవలు, స్పందన,  టిడ్కో హౌసింగ్ రుణాలు, ఉపాధిహామీ, గృహ నిర్మాణ పనులు, ఇంటి స్థలాలు, రీ సర్వే , జీ జీ ఎం పి, పిల్లలు - గర్భిణీలలో రక్తహీనత మరియు పోషకాహార లోపం తదితర అంశాలపై  విసి నిర్వహించగా స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత భవనాలు నిర్మాణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టామని, 90 రోజుల్లో ఇంటి స్థలం కేటాయింపు విషయంలో భూముల గుర్తింపు తదితర అంశాలపై మండల పరిధిలో చర్యలు తీసుకోవడం, జాయింట్ కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలో 158100 మందికి ఇళ్ళ స్థలాలు మంజూరు చేయగా, వారిలో 157457 మందికి పట్టాలు రిజిస్ట్రేషన్ డాక్యు మెంట్లు అందాయని వాటిలో 95800 పంపిణీ చేశామన్నారు. మిగిలిన 61,700 మందికి పంపిణీ చేయడం కోసం ఆయా ద్రువపత్రాలను పరిశీలించడం జరుగుతున్నట్లు తెలిపారు.పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా ఎస్ హెచ్ జి ల్లో లేని లబ్ధిదారులకు అదనపు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక చేయూత రుణం కింద ఇచ్చేందుకు బ్యాంకర్ల సమావేశంలో చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 19 వేల మంది కి బ్యాంకు రుణాలు అందించామన్నారు. జిల్లాలో బిబిఎల్ లో 27338, బి ఎల్ లో 6584,  ఆర్ ఎల్ లో 1537, ఆర్ సి లో 1232 ఉన్నాయని, స్టేజ్ కన్వర్షన్ కింద ఈ వారం 8,363 ఇళ్ళ కోసం ప్రతిపాదించడం జరిగి ఆమేరకు క్షేత్ర స్థాయి అధికారులుకు లక్ష్యం నిర్దేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఉపాధికహమీ కింద చెల్లింపుల్లో రూ.26.43 కోట్ల వేతనాలు జెనరేట్ చెయ్యగా, ఇప్పటి వరకు రూ.25.55 కోట్లు మేర చెల్లింపులు జరిపినట్లు పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలలో భాగంగా గుర్తించిన పనులను అత్యంత ప్రాధాన్యత తో చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో 732 పనులు గుర్తించగా, 622 పనులకు పరిపాలన ఆదేశం ఇచ్చి, 415 పనులు ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు.  టిడ్కో కి సంబంధించి రూ.3.73 కోట్ల మేర లబ్ధిదారులకు రుణాలు బ్యాంకర్లు ఇచ్చారని, ఈవారం రూ.4.01 కోట్ల రూపాయలు రుణ సదుపాయం కల్పించడం కోసం బ్యాంకర్ల తో సమావేశం నిర్వహిస్తామని అన్నారు.


పిల్లలు, గర్భిణీలలో రక్తహీనత మరియు పోషకాహార లోపం నివారణ కోసం చర్యల లో భాగంగా రక్త హీనత, పోషకాహార లోపం గల పిల్లల్ని గర్భిణీలని గుర్తించడం కోసం జిల్లాలోని 512 సచివాలయాలు లో గర్భిణీ లి 298 మంది 418 సచివాలయాల్లో 7461 మంది పిల్లలు ఉండగా, వారిలో రక్త హీనత, పోష్టికాహరం లోపం 

గల వారిని గుర్తించే ప్రక్రియ చేపట్టే దిశలో క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి సూచనలు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా సిసి ఎల్ ఏ కమిషనర్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి లు భూసేకరణ , రీ సర్వే,  ఉపాధిహామీ, ప్రాధాన్యత భవనా లు , ఇతర ప్రభుత్వ పథకాలు అమలు పై సమీక్ష నిర్వహించారు.



Comments