కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది
""" బిజెపిని ఆదరించాలి
కాకినాడ, అక్టోబర్ 1 (ప్రజా అమరావతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను, పలు ప్రాజెక్టులను చేపడుతుందని రాష్ట్రంలో మాత్రం ఆ పథకాలకు, ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ అన్నారు. ఇదే విధానాన్ని కొనసాగితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. శనివారం కాకినాడ అంబేద్కర్ భవన్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో ప్రజా పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సత్య కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రవేశపెడుతున్న పథకాలను మార్పు చేసి వాటికి వారి పేర్లు పెట్టుకుంటుందని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధానిగా రాష్ట్రానికి పలు నిధులను, ప్రాజెక్టులను తీసుకువస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు కాకినాడ నగరంలో 38 వేల ఇళ్లను అందిస్తే 4200 మాత్రమే నిర్మాణాలు సాగించారన్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నగదును రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం జగన్ ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నాడన్నారు. పేదలకు 16 లక్షలకు కోట్లకు గాను రెండు లక్షల కోట్లను పంచి 14 లక్షల కోట్లను మింగేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ త్వరలోనే భారీ ఎత్తున ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని సత్య కుమార్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చిలుకూరి రాంకుమార్, యెనిమిరెడ్డి మాలకొండయ్య, పెద్దిరెడ్డి రవికిరణ్, వేటుకూరి సూర్యనారాయణరాజు, తుమ్మల పద్మ, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, గట్టి సత్యనారాయణ, ముత్తా నవీన్, అనపర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment