భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర డి.జి.పి. శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఐ.పి.ఎస్.

 ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ (ప్రజా అమరావతి);




*పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర డి.జి.పి. శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఐ.పి.ఎస్..



రేపు ది.21.10.2022 తేదిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ది.20.10.2022 తేదిన రాష్ట్ర డి.జి.పి. శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఐ.పి.ఎస్.గారు ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, పోలీస్ పరేడ్ ను పర్యవేక్షించడం జరిగింది. 

అనంతరం రాష్ట్ర డి.జి.పి. గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే వారికి  ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు స్టేడియం నందు ఏర్పాటు చేసిన కట్టు దిట్టమైన భద్రత, పటిష్టమైన బందోబస్తు వివరాలను తెలుసుకుని తగు సూచనలు ఇవ్వడం జరిగింది.

                                                                                                                                                                                       

ఈ కార్యక్రమంలో రాష్ట్ర డి.జి.పి. శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఐ.పి.ఎస్.గారితో పాటు Addl.D.G. Dr. Shankhabrata Bagchi IPS గారు, నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.యస్ గారు, డిప్యూటీ పోలీస్ కమీషనర్ శ్రీ విశాల్ గున్ని ఐ.పి.ఎస్.గారు, డిప్యూటీ పోలీస్ కమీషనర్ శ్రీమతి డి.మేరీ ప్రశాంతి ఐ.పి.ఎస్.గారు, ఇన్ ఛార్జ్ డి.సి.పి. శ్రీ కొల్లి శ్రీనివాస్ గారు, ఇన్ ఛార్జ్ అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి పి.వెంకటరత్నం గారు, ఎస్.బి.ఏ.డి.సి.పి. శ్రీ సి.హెచ్.లక్ష్మీపతి గారు, ఎస్.బి.ఏ.సి.పి. శ్రీ సి.హెచ్.రవికాంత్ గారు, సెంట్రల్ ఏ.సి.పి. శ్రీ ఖాదర్ బాషా గారు, సి.ఏ.ఆర్.ఏ.సి.పి. శ్రీ చెంచి రెడ్డి గారు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గున్నారు.


Comments