వ్యాపార, వాణిజ్య సమస్యల పరిష్కరనికే ట్రేడ్ అడ్వైజరీ కమిటి : రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి
ఆర్ధిక అవగాహన కలిగిన మంత్రిగా జగనన్న కు తోడుగా నవరత్నాల అమలు : డిప్యూటి సి.ఎం
తిరుపతి, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి)
: దేశంలోనే మన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత నాలుగు సంవత్సరాలుగా మొదటి స్థానంలో ఉందని, 2019 లో ఎగుమతుల్లో 7 వ స్థానంలో ఉంటె నేడు 4 వ స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, స్కిల్ డెవలప్మెంట్ మరియు శిక్షణ, శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. గురువారం ఉదయం స్థానిక ఎస్.వి.యునివర్సిటీ సెనేట్ హాల్ నందు ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశం రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి అద్యక్షతన జరగగా డిప్యూటి సి.ఎం నారాయణ స్వామి, తిరుపతి ఎం.పి గురుమూర్తి, రాష్ట్ర ఉన్నతాధికారులు, వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్ లు పాల్గొన్నారు.
డిప్యూటి సి.ఎం కే.నారాయణ స్వామి మాట్లాడుతూ ఆర్థిక అవగాహన కలిగిన మంత్రి గా జగనన్న కు తోడుగా ఉండి నవరత్నాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన గారు లండన్ లో చదువుకున్నారని పేదల హృదయాలలో స్థానం సంపాదించుకొని ఏ ఒక్కరిని బాదించే వ్యక్తి కాదని అన్నిటికి చిరునవ్వుతో సమాదనమిస్తారని అన్నారు. గడప గడపకు కార్యక్రమంలో నవరత్నాల అమలు వల్ల ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగనన్న పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచాలని అడిగినప్పుడు మీరు, నేను చేయలేని పనులు చేస్తున్న వీరికి న్యాయమైన కోరికలు తీర్చాలని మాతో అన్నారని, ఒంటరి మహిళా వితంతువుకు కూడా పథకాలు అందాలని సూచించిన గొప్ప వ్యక్తి జగన్ గారు అని అన్నారు.
ఆర్ధిక శాఖ మంత్రి మాట్లాడుతూ సామాన్య మానవునికి సంక్షేమం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వo పై ఉంటుందని, ప్రభుత్వానికి ఆదాయం వాణిజ్య పన్నుల వల్లనే వస్తుందని అన్నారు. పూర్వం రాజులు పాలన కు భూమి శిస్తు లాంటివి వసూలు చేసేవాళ్ళని, ప్రజాస్వామ్యంలో క్రమంగా ప్రపంచమంతటా వాణిజ్య పన్నుల పైనే ప్రభుత్వాలు ఆదార పడుతున్న విషయం తెలిసిందేనని అన్నారు. వ్యాపారస్తులంటే ఏదో కొట్టేసే వాళ్ళని అనుకునే వారని, వాస్తవంగా కష్టపడి, అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి వ్యాపారం సాగిస్తారని అందుకే ముఖ్యమంత్రి వ్యాపారస్తులను స్నేహ పూర్వకంగా బావించి ఇబ్బంది పెట్టకుండా పన్నుల రాబడి చూడాలని ట్రేడ్ అడ్వైజరీ కమిటి ఏర్పాటు చేయాలని సూచించారని ఆ మేరకు మొదట అనంతపురం లో నేడు రెండవది తిరుపతి లో కమిటి సమావేశం నిర్వహించామని అన్నారు. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాపారాలు స్థంబించి అతలాకుతలం అయిందని అయినా సామాన్యుడిని కాపాడాల్సిన భాద్యత, భరోసా ప్రభుత్వం పైన ఉండడంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతున్నామని అన్నారు. చిత్త శుద్దితో పని చేస్తుంటే ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం 2 వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు బాగు చేసామని, ఫ్రెండ్లీ బిజినెస్ నిర్వహిస్తున్నందునే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మొదటి స్థానంలో నిలుస్తున్నామని, ఎగుమతుల్లో 2019 లో 7 వ స్థానంలో ఉంటే నేడు 4 వ స్థానంలో ఉందని అన్నారు. ఎగుమతుల అవకాశాలలో రాష్ట్రానికి 2 వ స్థానం ఉందని అందుకే విశాఖ-చెన్నై , చెన్నై – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. పరిశ్రమలకు కావలసిన నైపుణ్యత కలిగిన ఉద్యోగాల శిక్షణ కొరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను 176 ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే అందులో 66 కేంద్రాలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం సేవ చేయాలని చిత్త శుద్దితో పని చేస్తున్నామని అన్నారు. మామిడి, చింతపండు జి.ఎస్.టి లను తొలగించాలని గోవా లో జరిగిన 35వ జి.ఎస్.టి మీట్ లో వీటి ప్రాదాన్యత సూచించి వెంటనే చర్యలు చేపట్టేలా చేయగలిగామని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన 34 జి.ఎస్.టి మీట్లలో ఏ ఒక్కటి సాదిoచలేదని వివరించారు. ప్రతి మూడు మాసాలకు ట్రేడ్ అడ్వైజరీ మీటింగ్ లు నిర్వహించి వ్యాపారస్తులు పారిశ్రామిక వేత్తలు సూచిoచే సమస్యలు, సూచనలను కేంద్ర జి.ఎస్.టి మీట్ లో పరిష్కారానికి మా వంతు సహకారం ఉంటుందని వివరించారు.
జి.ఎస్.టి సమస్యల పై రజిత దిగుమతుల సుoకoపై త్వరగా అందేలా చూడాలని, హోటల్స్ అసోసియేషన్ బాల కృష్ణా రెడ్డి ఫుడ్ ఐటమ్స్ పై ట్యాక్స్ తగ్గింపు, చాంబర్ ఆఫ్ కామర్స్ మంజునాథ్ ఇటుకల పై ట్యాక్స్ తగ్గింపు, మహేష్ నిత్యావసర వస్తువులపై 25 కేజీల వరకు ట్యాక్స్ ఆపై లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ట్యాక్స్ సహకారంపై అభినందనలు శివ కుమార్ ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్రెసిడెంట్, నాగభూషణం ట్యాక్స్ ప్రాక్టీషనర్, టోరా ఇండస్ట్రీ, కోబెల్కో శ్రీ సిటీ వారు జి.ఎస్.టి అమలుపై ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.
ఈ సమీక్షలో చీఫ్ కమిషనర్ ట్యాక్స్ గిరిజా శంకర్, సెక్రటరీ గుల్జార్, స్పెషల్ సి.ఎస్ ఎస్.ఎస్.రావత్, కమిషనర్ రవి శంకర్, అడిషనల్ కమిషనర్ లు నాగేంద్ర, బాలాజీ, జాయింట్ కమిషనర్ స్టీఫెన్ సన్, అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్లు, వాణిజ్య వేత్తలు, వివిధ రంగాలకు చెందిన వ్యాపారస్తులు పాల్గొన్నారు.
addComments
Post a Comment