ప్రజా సమస్యల పరిష్కారానికి గడప గడపకు
పార్వతీపురం/పాచిపెంట, అక్టోబర్ 28 (ప్రజా అమరావతి): పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పాచిపెంట మండలం మూటకూడు గ్రామ సచివాలయం పరిధిలో తాడివలస, చిమిడివలస, గరిసేగుడ్డి, ఉయ్యాలమామిడి, జీలికవలస, తంగ్లామ్, పనసలపాడు, మెట్టపాడు, చిట్టివలస, మెట్టవలస, నిమ్మలపాడు మరియు పులిగూడ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శుక్రవారం నిర్వహించారు. గ్రామాల్లో గడప గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించుటకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దోహదపడుతుందని ఆయన చెప్పారు. పేద ప్రజల పక్షపాతి ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి కలిగిన లబ్ధిని వివరిస్తూ కర పత్రాలను ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం, వై.ఎస్ ఆర్ చేయూత తదితర పథకాల క్రింద ఆర్థిక సహాయం జమ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి ముందుగా సాలూరులో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర గారి క్యాంపు కార్యాలయంలో చీఫ్ మినస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం మక్కువకు చెందిన నారంసెట్టి శ్రీనివాసరావు కుమారై మనీషకు మూడు లక్షల రూపాయలు, సాలూరు బంగారామ్మ కాలనీకి చెందిన పోలిశెట్టి పద్మా కుమారి కి అరవై వేల రూపాయలు, మక్కువ మండలం కన్నంపేటకు చెందిన నక్క లక్ష్మణకు డబ్బదివేల రూపాయలు చెక్కులను పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment