ఇంద్రకీలాద్రి: అక్టోబర్ 2 (ప్రజా అమరావతి);
మూలా నక్షత్రం రోజున భక్తులకు అమ్మ దర్శనం కోసం ఏర్పాటుచేసిన చర్యలు మంచి ఫలితాన్ని ఇచ్చాయని
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణరావు తెలిపారు.
ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకుని వెళ్లినంతరం మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి మూలా నక్షత్రం రోజున అమ్మవారి పట్టు వస్త్రాలు అందజేయడానికి వచ్చిన సమయంలో గంటల తరబడి దర్శనాలకు ఆపడం వలన భక్తులు క్యూలైన్లలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యే వారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఈరోజు ముఖ్యమంత్రి కార్యక్రమాన్నికి కేవలం 60 నిమిషాలు మాత్రమే దర్శనాలను ప్రోటోకాల్ ప్రకారం నిలుపుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన ముఖ్యమంత్రి అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు మరింతగా కొనసాగాలంటే అమ్మ అనుగ్రహం ముఖ్యమంత్రికి ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. శరన్నవరాత్రులు సజావుగా జరగడానికి సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మూలా నక్షత్రం రోజున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగాకుండా పనిచేస్తున్న పోలీస్, ప్రెస్, సమాచార శాఖ సిబ్బంది, ఇతర అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అభినందించారు.
సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకూడదని ఈరోజు ప్రత్యేక దర్శనాలను నిలుపుదల చేయడం అయిందని, అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
addComments
Post a Comment