ఎపి వైద్య ఆరోగ్యశాఖ
ఎపి వైద్య ఆరోగ్యశాఖ
విజయవంతంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ ట్రయల్ రన్
పల్లె ప్రజలకు ఇంటి ముంగిట వైద్య సేవలు
డాక్టర్ ఇంటికి రావడంతో మంచాన పడిన రోగుల్లో ఎనలేని ఆనందం
అమరావతి (praja amaravati): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ పై శుక్రవారం ప్రారంభించిన ట్రయల్ రన్ పూర్తి విజయవంతమైంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబు, కమీషనర్ జె నివాస్, ఆయా విభాగాధిపతులు రేయింబవళ్ళు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంతో ఈ విధానం ప్రజలకు మరింత చేరువైంది. రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారులు కూడా అంకిత భావంతో పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు దోహదపడ్డారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు వెన్నుదన్నుగా నిలిచారు. ట్రయల్ రన్ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన విలేజ్ హెల్త్ సెంటర్ల లో 21వ తేదీన ప్రారంభించిన ఈ ట్రయల్ రన్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. తొలి రోజు మొత్తం 676 మండలాలలో 653 క్లినిక్ లలో 572 మంది ప్రభుత్వ డాక్టర్లు, 81 మంది 104 సర్వీస్ డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 653 మంది డాక్టర్లు ఓపి సేవలు ప్రారంభించగా 4922 మంది పేషెంట్లకు ఓపి సేవలు అందాయి. 103 మందిని ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులకు అనుసంధానించారని వివరించారు. అదే విధంగా రెండో రోజు 676 మండలాలలో 629 క్లినిక్ ల నుండి 517 మంది ప్రభుత్వ డాక్టర్లు, 112 మంది 104 సర్వీసు డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని 6578 మంది పేషెంట్లకు ఓపిసేవలందించారు. ఓపి అనంతరం పాలియేటివ్ కేర్ లో భాగంగా డాక్టర్లు ఇళ్లవద్ద మంచాన పడిన పేషెంట్లు, ఆరోగ్యశ్రీ లబ్దిదారులను పరామర్శించి వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖలను అందచేశారు. ప్రజల వద్ద ఉన్న సదరం సర్టిఫికెట్లను కూడా అధికారుల పరిశీలనకు ఆన్ లైన్ లో పెట్టి అందుకు సంబంధించిన వెనువెంటనే ఫలితాలు పొందేలా చర్యలకు సిఫారసు చేశారు. సదరం సర్టిఫికెట్లు ఉన్న వారికి ఏటా రెండుసార్లు ప్రభుత్వం పెన్షన్ రూపేణా ఆర్థిక సహాయం అందచేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుని విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు , డిప్యూటీ డిఎంహెచెవ్వో లను కమీషనర్ నివాస్ ప్రత్యేక ప్రశంసలందచేశారు. అలాగే అంకిత భావంతో సేవలందించిన ఎంఎల్ హెచ్ పిలు, స్టాఫ్ నర్స్ లు, ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లకు అభినందనలు తెలియచేశారు.
ఫ్యామిలీ డాక్టర్ సేవలిలా...
ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్యాధికారి, మిగిలిన బృందం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలను నెలలో రెండుసార్లు సందర్శిస్తారు. అక్కడ ట్రీట్మెంట్‌తో పాటూ ఆరోగ్య శ్రీ సేవలపైనా ఆరా తీస్తారు.. ప్రాథమిక వైద్య సేవల్లో భాగంగా.. ప్రతి 2వేలమందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయి.. ఈ క్లినిక్‌లకు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌గా నామకరణం చేశారు. 6,313 సబ్ సెంటర్స్.. అలాగే మరో 3,719 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంజూరు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి.. ఒక్కో క్లిన్ పరిధిలో 2వేలమందికి సేవలు అందిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త భవనాల్లో ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఓ ఏఎన్‌ఎం, ఒక ఎమ్‌ఎల్‌హెచ్‌పీ (Mid-Level Health Provider renamed as Community Health Officer-CHO), ఆశా వర్కర్ సేవలందిస్తారు. ఈ విలేజ్ క్లినిక్‌లలో అన్ని రకాల వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉంటాయి. గ్రామ స్థాయిలో నయం కాని ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు. ఎఎన్ ఎం అక్కడ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. చిన్న పిల్లలు, గర్భిణిలకు కూడా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు టెలీ మెడిసిన్, టెలీ హబ్‌ల ద్వారా మెడికల్ ఆఫీసర్‌తో పాటూ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత మెల్లిగా వైద్య సేవలను ఇంటికే అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆశా వర్కర్లు వైద్యం అవసరమైన వారిని గుర్తిస్తారు. దీనితో పాటు అంగన్వాడీలు, స్కూళ్లను సందర్శించి అక్కడి విద్యార్ధుల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని అవసరమైన మందులను పంపిణీ చేస్తారు.
ఈ హెల్త్ క్లినిక్‌ల ద్వారా 14 రకాల డయాగ్నోస్టిక్ ర్యాపిడ్ కిట్స్.. 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. అలాగే రాష్ట్రంలో ప్రతి పౌరుడికి.. వారి ఇంటి వద్ద పరీక్షలు జరిపి వారి ఆరోగ్య సమాచారాన్ని " డిజిటలైజ్" చేస్తారు. ప్రతి పౌరుడి వివరాలు , వారి అనుమతి తీసుకోని, డిజిటలైజ్ చేస్తారు. ప్రతి పౌరుడికి డిజిటల్ HEALTH ID ఇస్తారు. ఈ ID కేంద్ర ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా ఉంది. ఇప్పటి వరకు 3,25,02,850 మందికి స్క్రీనింగ్ నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ NCD డేటాను ఫ్యామిలీ డాక్టర్‌కు పంపించి ఫాలో అప్ చేస్తారు. అంటే ఎన్ సిడి డేటాను ఫ్యామిలీ ఫిజీషియన్ తో అనుసంధానం చేస్తారు.
ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను దేశంలోనే తొలిసారి ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఎన్‌సిడి స్క్రీనింగ్, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తో ఏకీకృతం చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అవసరమైన వారికి, NCD కేసులకు ఫ్యామిలీ డాక్టర్ రెగ్యులర్ ఫాలో అప్ ఉంటుంది.ఈ NCDని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో అనుసంధానించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను సాధించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి మండలానికీ రెండు పీహెచ్సీల నుండి నలుగురు వైద్యులు అందుబాటులో ఉంటారు.
డాక్టర్ లకు ఇప్పటికే మొబైల్ సిమ్ ను అందజేశారు. సంబంధిత విలేజ్ హెల్త్ క్లినిక్ లో డాక్టర్ మొబైల్ నంబరును ప్రదర్శించాలని ఆదేశించారు.
addComments
Post a Comment