రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
.. రుడా పరిధిలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రణాళిక బద్ధంగా అమలు చేస్తున్నాం.
.. రుడా పరిధిలో ఇప్పటి వరకు రు. 2 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
... రుడా చైర్ పర్సన్.. షర్మిళా రెడ్డి.
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(రుడా) పరిధిలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రణాళిక బద్ధంగా అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు రుణ పరిధిలో రు. 2 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక రుడా కార్యాలయం సమావేశ మందిరంలో రుడా 3వ బోర్డ్ సమావేశాన్ని రుడా చైర్ పర్సన్ షర్మిల రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్, రుడా వైస్ చైర్మన్ వి.వివేక్ లతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్. షర్మిల రెడ్డి మాట్లాడుతూ రూడా పరిధిలో ఇటీవలి స్వీయ ఆదాయ వనరుగా జగనన్న ఉమెన్స్ సేఫ్ వెవెన్స్ ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
అదేవిధంగా ఆజాద్ చౌక్ వద్ద క్లాక్ టవర్, ఎయిర్ పోర్ట్ సుందరీకరణ పనులు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రుడా
గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాజమహేంద్రవరంలోని పలు పార్కులను సుందరీకరణకు చేపట్టే పనులు టెండర్ల దశలో ఉన్నాయన్నారు. పుష్కర్ ఘాట్స్ లో డ్రెస్ చేంజింగ్ గదులు కు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు. రుడా పరిధిలోగల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నమన్నారు. ఇందులో భాగంగా అనపర్తి నియోజకవర్గం లో జంక్షన్ డెవలప్మెంట్, రాజానగరంలో జిమ్ అభివృద్ధి, రాజమహేంద్రవరం రూరల్ లో పార్కుల అభివృద్ధి పనులు, పర్యాటకరంగం అభివృద్ధిలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి, నిడదవోలు నియోజకవర్గం లో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా
ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే సమావేశం నాటికి ప్రతిపాదించిన పనులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గోపాలపురం నియోజకవర్గం, రాజానగరంలోని కొన్ని మండలాలను, రామచంద్రపురం నియోజవర్గానికి సంబంధించి మలికిపురం సకినేటిపల్లి మండలాలు రుడా పరిధిలో చేర్చాలని జిల్లా ఇంఛార్జి మంత్రి, ఆయా శాసనసభ్యులు గత సమావేశం లో ప్రతిపాదనలు తెచ్చారన్నారు. ప్రధాన కార్యాలయం నుండి అనుమతులు రాగానే వాటిని కూడా రుడా పరిధిలో చేర్చడం జరుగుతుందని తెలిపారు.
రుడా మాస్టరు ప్లానులో తీసుకోవలసిన జాగ్రత్తలు, అభివృద్ధిని మొదలగు అంశాల గురించి వివరించారు. రెండవ బోర్డు మీటింగులో జరిగిన అంశాలపై చర్య నివేదికను వివరించారు. మూడవ బోర్డు మీటింగు సంబంధించిన బోర్డు ఏజెండా అంశాలను గురించి వివరిస్తూ మాస్టరు ప్లాను యొక్క పురోగతి, రుడా పరిధిలోని చుట్టు ప్రక్కల ఉన్న కొన్ని గ్రామాలను రుడా పరిధిలో కలిపే వాటిపై చర్చించి ఆమోదం కొరకు పంపడం జరుగుతుందన్నారు.
మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిది రుడా పరిధిలోనే ఉన్నందున, నగరపాలక సంస్థ ద్వారా చేపట్టనున్న అభివృద్ధి లో రుడా భాగ స్వామ్యం తో ఆర్ ఎమ్ సిర్ పరిధిలో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందుకోసం మానవ వనరుల, తరితర అంశాలలో రుడా తో సమన్వయం చేసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే సాంకేతిక ఇంజనీర్ లని కేటాయించినట్లు తెలిపారు.
రుడా వైస్ చైర్మన్ వి వివేక్ మాట్లాడుతూ రుడా పరిధిలో 4284 దరఖాస్తులు రాగా వీటిలో ఇప్పటివరకు 3207 ఆమోదించమన్నారు. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు సంబంధించి టి ఎల్ పి క్రింద 83 దరఖాస్తులు రాగా 46, ఎఫ్ ఎల్ పి క్రింద 46 కు గాను, 45, ఎల్ డి సిసి క్రింద 39 గాను 27 ఆమోదించామన్నారు. రూడా పరిధిలో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి 347 దరఖాస్తులు రాగా 156 ఆమోదించమన్నారు. ఎల్ ఆర్ ఎస్ 2020 క్రింద రుడా పరిధిలో ఇప్పటివరకు వ్యక్తిగత దరఖాస్తులు 3520 రాగా, 539 ఆమోదించగా వీటి ద్వారా రు. 1162.62 లక్షలు సేకరించడంజరిగిందని, మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమం లో రుడా వైస్ చైర్మన్, వి. వివేక్, రుడా సెక్ర టరీ, వి. శైలజ, ప్లానింగ్ అధికారి, టిజిరామమోహన్, ఏఓ జి. శ్రావణ్ కుమార్, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి, ఎ. అనిత, ఈఈ టి. చంద్ర శేఖర రావు, జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎస్.బి.వి రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖఅధికారి కె.వెంకటేశ్వరరావు, మునిసిపల్ కమీషనర్ నిడదవోలు, కెవి పద్మావతి, డి పిఓ, పి. జగదాంబ, టూరిజం డిడిఈ జి. సత్యనారాయణ, టూరిజం డివిజనల్ మేనేజర్, బి వి యం. శ్రీనివాస రావు, పొల్యూషన్ కంట్రోల్ బో ర్డ్, ఈ ఈ, ఎన్. అశోక్ కుమార్ తది తరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment