నేటి యువత అబ్దుల్ కలామ్ చెప్పిన కలలు కనండి వాటిని సాకారం చేసుకోవాలి



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


* నేటి యువత అబ్దుల్ కలామ్ చెప్పిన కలలు కనండి వాటిని సాకారం చేసుకోవాలి 



* నేటి తరం విద్యార్ధులు అబ్దుల్ కలాం  ఆదర్శలను స్పూర్తిగా తీసుకోవాలి..


..జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత



నేటి తరానికి భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న  ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ మార్గదర్శులని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. 



శనివారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం, ఆల్ కట్ తోటలోని అబ్దుల్ కలాం ఐఏఎస్ అండ్ నీట్ అకాడమీ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం జయంతి వేడుకల సందర్భంగా విగ్రహా ఆవిష్కరణ చేసి విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా కలెక్టరు డా.కే.మాధవీలత మాట్లాడుతూ  హార్డ్ వర్కు,హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ అని నిరంతరం

అబ్దుల్ కలామ్ పేర్కొనే వారన్నారు. అటువంటి వ్యక్తులు దేశానికే గర్వకారణమని, నేటి తరం  విద్యార్థులు , యువత వారి ఆదర్శయాలను  స్పూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. రాష్ట్రపతి పదవికి ముందే దేశం కోసం ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమని తెలిపారు. ఆర్మీ, పృద్వి వంటి మిస్సైల్స్ తో పాటు మొత్తం మిస్సైల్స్ రంగంలోనే దేశానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఆయనకు పిల్లలన్న, విద్యార్థులన్న మక్కువని, తరచుగా తన హోదాను మరిచి కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉండేవారని అన్నారు. కలామ్ రచించిన ఇగ్నిటెడ్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 రచనలు పాత, కొత్త తరానికి కూడా చైతన్యం వస్తుందని తెలిపారు. అబ్దుల్ కలామ్ గొప్ప రాష్ట్రపతిగానే కాకుండా శాస్త్రవేత్తగా,  సామాజిక కర్తగా సేవలు అందించారన్నారు.    అటువంటి మహనీయుని జయంతిని నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. 

ఎంత పెద్ద లక్ష్యమైనా దానిని అధిరోహించే వరకు ప్రణాళికా బద్దంగా సాధన చేయాలని విద్యార్థులకు ఎల్లప్పుడు అబ్దుల్ కలామ్ చేప్పేవారన్నారు. 18 గంటలు చదివి ఒకరు విజయం సాధిస్తే మరొకరు విజయం సాధించ లేదంటే దాని అర్థం సరైన శిక్షణ పొందకపోవడమేనని అన్నారు. ఆయన చూపిన బాట అందరికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనలో పాలుపంచుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. 


అబ్దుల్ కలాం ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా భోధన చేస్తామని అకాడమీ  డైరెక్టర్ సూరి కుమారి అన్నారు. 5 వేల మంది ఐ.ఏ.ఎస్ లను, 5 వేల మంది ఇంజనీర్లు ను తయారు చేయడమే అకాడమీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.



అకాడమీ ఫౌండర్, మెంటర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ 2013 అకాడమీ స్థాపించామని తెలిపారు. ఈ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించి క్యాష్ ప్రైజ్ లు ఇస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 30న రాష్ట్ర స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో  గెలుపొందిన విద్యార్థులకు రూ 50 వేల రూపాయలు క్యాష్ ప్రైస్ ఇస్తున్నామని అన్నారు. 



ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రామ్ గోపాల్, అకాడమీ డైరెక్టర్ సూరి కుమారి, నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్ టేకి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ చైర్ ఫర్సన్ బి. పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image