నెల్లూరు, అక్టోబర్ 26 (ప్రజా అమరావతి): గత 15 ఏళ్లుగా ముత్తుకూరు మండల ప్రజలు ఎదురు చూస్తున్న కల నెరవేరే సమయం ఆసన్నమైంద
ని, నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీ కింద 16128 మంది లబ్ధిదారులకు రూ. 36 కోట్లను బటన్ నొక్కి ముఖ్యమంత్రి నేడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం ముత్తుకూరు మండలం నేలటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి మంత్రి పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీ, ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన వంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తప్ప మరొకరు చేయలేరన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేసిన జెన్కో మూడో యూనిట్ ను ఆయన తనయుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి, విద్యుత్ వెలుగులను జాతికి అంకితం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గృహ, పరిశ్రమ, వ్యవసాయ రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా నిరంతరాయంగా లభిస్తుందన్నారు. అలాగే కృష్ణపట్నం పోర్టు ఏర్పాటుతో ఫిషింగ్ జెట్టి ని కోల్పోయిన మత్స్యకారులు తమకు ఫిషింగ్ జెట్టి నెలకొల్పాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారని, వారి కోరిక మేరకు ముత్తుకూరు సమీపంలో రూ 25 కోట్లతో సుమారు 400 పడవలు నిలిచేలా మినీ ఫిషింగ్ హార్బర్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. గురువారం ఉదయం 10:30 గంటలకు నేలటూరులోని జెన్కో హెలిప్యాడ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకొని జెన్కో మూడో యూనిట్ను జాతికి అంకితం చేస్తారని, 11.30 గంటలకు బహిరంగ సభకు విచ్చేస్తారన్నారు. సుదీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపుతూ జిల్లాకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలందరూ అపూర్వ స్వాగతం పలకాలని మంత్రి పిలుపునిచ్చారు.
మంత్రి వెంట విద్యుత్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ కె విజయానంద్, జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి శ్రీధర్, ట్రాన్స్కో విజిలెన్స్ జే ఎం డి శ్రీ మల్లారెడ్డి, ఎస్పీ శ్రీ విజయ రావు, జెసి శ్రీ కూర్మనాథ్, నూడా వీసీ శ్రీ బాపిరెడ్డి, ఆర్డిఓ మలోల, జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు.
addComments
Post a Comment