ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి);
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ దర్శించుకున్నారు.
కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మకు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు, ఆలయ ఈవో డి. భ్రమరాంబ స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం ఆశీర్వచనమండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి అమ్మవారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
addComments
Post a Comment