నాసిన్ రాయలసీమకు తలమానికం కానుంది
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
పాలసముద్రం, అక్టోబర్ 10 (ప్రజా అమరావతి):
నూతనంగా ఏర్పడిన జిల్లాలో పాలసముద్రం వద్ద ఏర్పాటు చేయనున్న నాసిన్ కేంద్రం రాయలసీమ ప్రాంతానికే తలమానికం కానుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ పేర్కొ మన భజన్ సంధ్య పెళ్లి నమస్తే మేడం ఫోన్ చేసిందాన్నారు.
సోమవారం ఆయన నాసిన్ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ , ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ , ఎస్పి రాహుల్ దేవ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రివర్యులు మాట్లాడుతూ పాలసముద్రంలో నెలకొల్పే నాసీన్ సంస్థ భారతదేశ చరిత్ర పటాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది పేర్కొన్నారు
ముస్సోరిలోని ఐఏఎస్ శిక్షణా కేంద్రం, హైదరాబాద్ లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ పోలీసు శిక్షణా కేంద్రాల వలే నాసిన్ లో ఐఆర్ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీసు) ఉద్యోగులు, కస్టమ్స్ ఉద్యోగులు శిక్షణ పొందబోతున్నారన్నారు. నాసిన్ కేంద్రం భారత దేశంతో పాటూ ఆగ్నేయ ఆసియా లోని దేశాలన్నింటి ఉద్యోగులకు శిక్షణ అందించనుందన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామమని తెలిపారు.
నాసిన్ ప్రాధాన్యత గుర్తించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెనక బడిన రాయలసీమ ప్రాంతంలోనే ఈసంస్థ ఏర్పాటు చేయడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మంచి శుభ పరిణామమని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాసిన్ వీలైనంత త్వరగా నిర్మాణ పూర్తి అయ్యేందుకు, జిల్లా అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అంద చేయడం జరుగుతుందని తెలిపారు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే నేను ఇక్కడ రావడం జరిగిందని తెలిపారు.
ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి పలు చర్యలు చేపడతానని తెలిపారు, ఇక్కడ భూమి, కేంద్ర విద్యాలయ ఏర్పాటు, అరణ్య శాఖ నుంచి అనుమతి, భూగర్భ జలాల పెంపుదల, పలు అంశాలపై, ఈరోజు సమీక్షించడం జరుగుతుందని, స్థానిక శాసనసభ్యులు పలు సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజ శంకర్ , డైరెక్టర్ నారాయణస్వామి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
[
addComments
Post a Comment