లేఅవుట్ల అభివృద్ధి కోసం భూ సేకరణపై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలి

 లేఅవుట్ల అభివృద్ధి కోసం భూ సేకరణపై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మార్గదర్శకాలు  కచ్చితంగా అమలు చేయాలి


జిల్లా కలెక్టర్   బసంత కుమార్ 



పుట్టపర్తి, అక్టోబర్ 11 (ప్రజా అమరావతి):  


లేఅవుట్ల అభివృద్ధి కోసం భూ సేకరణపై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మార్గదర్శకాలు  కచ్చితంగా అమలు చేయాలి  జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం సమయంలో స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్సు హాలు నందు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారులు అమ్మే ధర కంటే తక్కువకు ఇళ్ల స్థలాలను మధ్య ఆదాయవర్గాల (ఎంఐజీ)కు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమాల తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్లు వేసేందుకు స్థలాల సేకరణ, పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయిలో పురపాలక శాఖ కమిషనర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో, జిల్లా స్థాయిలో  కలెక్టర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీలు వివిధ పట్టణ ప్రాంతాలు, నగరాలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలో స్థలాల ఎంపిక, లబ్ధిదారుల గుర్తింపు, డిమాండ్ సర్వే ప్రక్రియను చేపడతాయి 

తెలిపారువివాదాలకు తావులేని భూములు సేకరించాలి. వరద నీటి ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిశీలనకు తీసుకోరాదు. జిల్లా కేంద్రంలో ఒక్కో లేఅవుట్‌ కోసం 150 నుంచి 250 ఎకరాలు అవసరమని  గుర్తించాలని తెలిపారు ఇతర పట్టణాల్లో 50 నుంచి 100 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. పట్టణాలకు 3 నుంచి 5 కిలో మీటర్ల దూరంలో భూమి సేకరించాలి. భవిష్యత్తులోనూ తగిన అభివృద్ధి జరిగే అవకాశం ఉందని భావించే ప్రాంతాలను ఎంపిక చేయాలి.   ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్టర్ కృష్ణకుమారి ahuda వైస్ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్,  సెక్రెటరీ చెన్నయ్య గారు, సర్వేరు, సంబంధిత అధికారులు తరులు పాల్గొన్నారు

  

Comments