రామచంద్రపురం (ప్రజా అమరావతి);
స్వేచ్ఛ, స్వచ్ఛ, స్నేహా, సేవా లక్ష్యంగా రామచంద్రపురాన్ని స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు.
ఆదివారం రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్చత మన బాధ్యత కార్యక్రమంలో మంత్రి, చైర్పర్సన్ గాదం శెట్టి శ్రీదేవి, కమిషనర్ శ్రీకాంత్ మరియు కౌన్సిలర్స్ లతో కలసి పాలకొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని పౌరులు స్వంచందం గా ముందుకు వచ్చి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల
ని కోరారు.
స్వచ్చత పరంగా ప్రభుత్వ అనేక కార్యక్రమాలు చెపటుతున్నప్పటికి పౌరులు స్వచ్చత పట్ల అవగాహన పెంచుకోవలన్నారు. ఉదయం పూట వ్యాయామం చేసేవారు, కాలినడక నడిచేవారు, స్థానికులు స్వచ్చత పట్ల అవగాహన కలిగి రామచంద్రపురాన్ని స్వచ్ఛ రామచంద్రపురం గా తీర్చిదిద్దే విధంగా ముందుకు రావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
addComments
Post a Comment