ఫిషింగ్ బోటు జెట్టి నిర్మాణం స్పెషల్ స్టోరీ:

 ఫిషింగ్ బోటు జెట్టి నిర్మాణం స్పెషల్ స్టోరీ:



  ఈ నెల 27 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారిచే  ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి శంఖుస్థాపన.


*  ఫిషింగ్ జెట్టి నిర్మాణం వలన  ప్రత్యేక్షంగా మరియు పరోక్షంగా 2000 మంది మత్స్యకారులకు జీవనోపాధి. 


* ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు కృష్ణపట్నం పోర్ట్ వారు సంయుక్తంగా 25  కోట్ల రూపాయల  అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫిషింగ్ జెట్టి నిర్మాణం.


2008వ సంవత్సరంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం నందు ఫిషింగ్ హార్బర్ ప్రాంతం నందు కృష్ణపట్నం పోర్ట్ ఏర్పాటు చేయడం వలన మత్స్యకారుల పడవలకు బెర్తింగ్ సదుపాయం లేక పోవడం, వేట ద్వారా వచ్చిన మత్స్య సంపదను  సకాలంలో మార్కెటింగ్ సదుపాయం చేసుకునే అవకాశం లేకపోవడం వలన మత్స్యకారులకు సరి అయిన ఆదాయం లభించక పోవడం అంతే కాకుండా తూఫాన్ సమయములలో పడవలకు హార్బర్ లేకపొడవం వలన పడవలకు రక్షణ ఉండేది కాదు. దీనికి పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం  ఈ ప్రాంత మత్స్యకారుల సంక్షేమాన్ని  దృష్టిలో వుంచుకొని   ముత్తుకూరు మండలంలోని నేలటూరు ప్రాంతంలో రాష్ట్ర  ప్రభుత్వం మరియు కృష్ణపట్నం పోర్ట్ వారు సంయుక్తంగా  25  కోట్ల రూపాయల  అంచనా వ్యయంతో (250) పడవలకు బెర్తింగ్ చేయు విధంగా ఫిషింగ్  జెట్టి  నిర్మాణం  చేపట్టబడుచున్నది. సర్వేపల్లి నియోజకవర్గంలో  తీరప్రాంత మండలాలైన ముత్తుకూరు మండలం  నందు 395 మోటార్ పడవలు,  తోటపల్లిగూడూరు మండలం నందు  178 మోటార్ పడవలు మర్చెంటైల్ షిప్పింగ్ చట్టం,1964 క్రింద రిజిస్టర్ కాబడి ఉన్నాయి. ఈ  రెండు మండలాల్లో మొత్తం 573 మోటార్ పడవల ద్వారా 3500 మత్స్యకారులు సముద్ర వేట మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.


*జెట్టి నిర్మాణ వివరములు*

........................

పొడవు 250 మీటర్లు, 

చానల్ వెడల్పు 45 మీటర్లు,  

చానల్ లోతు (-3) మీటర్లు,   

సముద్రంలో రక్షణ గోడ (370) మీటర్లు,

చానల్ నందు సముద్ర ముఖ ద్వారం నుండి చానల్ నందు 2 కి.మీ మేర డ్రెడ్జింగ్ చేయుట.


ఫిషింగ్ బోటు జెట్టి నిర్మాణము వలన ప్రత్యేక్షంగా మరియు పరోక్షంగా 2000 మంది మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతుంది. 


Comments