ఉత్సవ శోభ వెల్లి విరియాలి

 

 ఉత్సవ శోభ వెల్లి విరియాలి


 విజయనగరం ఉత్సవాల పై సమీక్షించిన కలెక్టర్ సూర్యకుమారి

విజయనగరం, అక్టోబరు 01:(ప్రజా అమరావతి):  ఉత్సవాల ఆనందం ప్రతి ఒక్కరి మది లో  పదిలంగా నిలిచిపోయెలా సంరంభంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు.  విజనగర ఉత్సవాల ఏర్పాట్ల పై శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆమె సమీక్షించారు.



 9వ తేదీన 

 ఉత్సవాల ప్రారంభం అమ్మవారి గుడి వద్దనుండి ఆనంద గజపతి ఆడిటోరియం వరకు సాగే కార్నివాల్ తో ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ ర్యాలీ లో పాల్గొనే కళాకారులకు, పలు సంస్థల నుండి వచ్చే ప్రతినిధులకు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. తాగునీరు, స్నాక్స్ అందించాలని, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

 తదుపరి ఆనంద గజపతి ఆడిటోరియంలో  నృత్య ప్రదర్శన పోటీలు, గురజాడ కళా క్షేత్రం లో నాటకాలు, నాటికల పోటీలు, సంగీత కళాశాలలో పుష్ప ప్రదర్శన, రెవిన్యూ కళ్యాణ మండపంలో పాటల పోటీలు, మన్నార్ రాజగోపాల్ దేవాలయం నందు హరికధ లు, బుర్రకధలు, అవధాన కార్యక్రమాలు, శిల్పారామం లో    జానపదాలు, మార్షల్ ఆర్ట్స్ జరుగుతాయని, అయోధ్య మైదానం లో మెగా మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.  ఈ సందర్బంగా వేదికల వారీగా ఇన్ఛార్జ్ అధికారులతో ఏర్పాట్ల పై సమీక్షించారు. ఉత్సవాల్లో పాల్గొనే  అందరిని గౌరావించేలా సర్టిఫికేట్లు, శాలువలు, జ్ఞాపిక లను వేదికల ఇంచార్జ్ లు సిద్ధం చేసుకోవాలన్నారు. ఆహ్వానం పలికే  స్వాగత ద్వారాలు  ఆకర్షణీయంగా తయారు చేయాలని సూచించారు.  సోమవారానికల్లా  వేదికల వద్ద ఏర్పాట్లు కొలిక్కి రావాలన్నారు. శాంతి భద్రతల లోపం లేకుండా పోలీస్ యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు మున్సిపల్ కమీషనర్ ఏర్పాటు చేయాలన్నారు. 


ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా శాఖాధిపతులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Comments