సచివాలయ కార్యదర్శులు మరియు వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు

 గుంటూరు. (ప్రజా అమరావతి); నగరం సంపత్ నగర్ లోని మేయర్  నివాసం వద్ద గల క్యాంపు కార్యాలయం నందు 65వ సచివాలయ కార్యదర్శులు మరియు వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు


చేసి,సచివాలయ పరిధిలోని స్థానిక సమస్యలను మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు అడిగి తెలుసుకుని,స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించి,అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్న గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు.

ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ,

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమన్నారు.

దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయ వ్యవస్థను ఆదర్శంగా తీసుకొని వారి రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టుటకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.

ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు ఇతర సేవలు ప్రజలకు సత్వరమే అందించుటకు అవకాశం ఉందన్నారు.

ముఖ్యంగా కరోనా వంటి ప్యాండమిక్ లాక్ డౌన్ సమయంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటయే కాక కరోనా వ్యాప్తిని అరికట్టుటలో కీలకపాత్ర వహించిందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల ద్వారా సొంత గృహాలు లేని పేద ప్రజలకు ఇచ్చిన ఫ్లాట్ల యందు త్వరితగతిన గృహాలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 

రాష్ట్రంలో కుల,మత పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందేలా చూసే బాధ్యత సచివాలయ కార్యదర్శులపై మరియు వాలంటీర్లపై ఉందన్నారు.

ప్రజల నుండి వచ్చు పిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి,వారి పిర్యాదులను వెంటనే పరిష్కరించి, మరల పునరావృతం కాకుండా చూడాలన్నారు.

కార్యదర్శులు మరియు వాలంటీర్లు వారి సచివాలయ పరిధిలో డోర్ టు డోర్ తిరిగి స్థానిక సమస్యలను గుర్తించి,వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

వాలంటీర్లు మరియు కార్యదర్శులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధుల్లా ఉంటూ,సంక్షేమ పథకాలు ప్రజలకు త్వరితగతిన అందేలా చూడాలన్నారు.

కార్యదర్శులు మరియు వాలంటీర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సంయుక్తంగా పనిచేసి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

కార్యదర్శులకు మరియు వాలంటీర్లకు విధుల నిర్వహణలో స్థానికంగా సమస్యలు ఏమైనా ఎదురైనట్లయితే,స్థానిక అధికారుల మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి గాని,తమ దృష్టికి తీసుకురావాలని,సదరు సమస్యలను వెంటనే పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శులు,వాలంటీర్ లు పాల్గొన్నారు.


Comments