అమరావతి రైతుల మహా పాదయాత్రకు నందమూరి రామకృష్ణ సంఘీభావం_

 పశ్చిమగోదావరి జిల్లా (ఆచంట) (ప్రజా అమరావతి);


అమరావతి రైతుల మహా పాదయాత్రకు నందమూరి రామకృష్ణ సంఘీభావం_



- రాజధాని రైతుల త్యాగాలను అవమానించడం దారుణం*


 హోరువర్షంలో సైతం అమరావతి రైతుల మహా పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో నిరాటంకంగా సాగుతోంది. 


 ఆచంట నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న 28వరోజు పాదయాత్రకు పలువురు ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. 


 ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, మాజీమంత్రులు పితాని సత్యనారాయణ, కెఎస్ జవహర్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, రాష్ట్ర ఉపాథి హామీ మండలి మాజీ సభ్యుడు వీరంకి గురుమూర్తి తదితరులు సంఘీభావం తెలిపినవారిలో ఉన్నారు. 


 భారీవర్షాన్ని సైతం లెక్కచేయకుండా సుమారు 3గంటలపాటు రామకృష్ణ రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. 


_*ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ...*_


 అమరావతి రైతుల పాదయాత్రపై వైసిపి నేతలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.


 సెంటు స్థలం ఇస్తే భూమి విలువ ఏమిటో వారికి తెలుస్తుందని అన్నారు. 


 రాజధాని కోసం 33వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులను అవమానిస్తూ హేళనగా మాట్లాడటం తగదన్నారు. 


 ప్రపంచంలో గానీ, దేశంలోగానీ ఎక్కడా మూడురాజధానులు విజయవంతమైన దాఖలాలు లేవన్నారు. 


 నిజమైన పాలనా వికేంద్రీకరణను మండల వ్యవస్థ ద్వారా దివంగత నేత ఎన్టీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. 


 నారా చంద్రబాబు నాయుడు హయాంలో కియా హీరో హోండా ఇసుజి అశోక్ లేలాండ్ మొబైల్ ఫోన్స్ యూనిట్స్ ఐటీ కంపెనీలు మరియు 11 జాతీయ విశ్వవిద్యాలయాలను జిల్లాకు ఒక్కటి చొప్పున ఏర్పాటు చేసి అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించారని అన్నారు. 


 ఆదివారంనాటి పాదయాత్రl లో పెనుగొండ, కవటం, మార్టేరు మీదుగా మూడు గంటలపాటు నందమూరి రామకృష్ణ పాదయాత్ర చేశారు.

Comments