స్కిల్ హబ్ ల ద్వారా మెండుగా ఉపాధి అవకాశాలు

 డిమాండ్ రంగాలలో యువత కు శిక్షణ


స్కిల్ హబ్ ల ద్వారా మెండుగా ఉపాధి అవకాశాలు



హిందూపురంలో స్కిల్ హబ్ ప్రారంభం


జిల్లా కలెక్టర్   బసంత కుమార్


  

హిందూపురం, అక్టోబర్ 1 (ప్రజా అమరావతి):  

స్కిల్ హబ్ ల ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం హిందూపురం పట్టణంలోని మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ లో భాగంగా నిర్వహించిన స్కిల్ హబ్ ను ప్రారంభించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,  బసంత కుమార్ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, తదితరులు పాల్గొన్నారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంప్లాయిమెంట్ కింద అందరికీ ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక రకాలుగా చొరవ తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లతో గ్రామాల్లోనే అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా కళాశాలలలో, పాలిటెక్నిక్ లలో, యూనివర్సిటీలలో విద్యార్థులు అనేక రకాల కోర్సులను చేస్తున్నా ఉద్యోగానికి పనికి వచ్చే నేర్పరితనం, స్కిల్స్ ఇవ్వడంలో వెనుకబడి ఉన్నామన్నారు. అవసరమైన సప్లిమెంట్స్ అందించడం కోసం స్కిల్ హబ్స్, స్కిల్ కాలేజీలు, యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నూతన విద్యాన విధానం కింద అందరికీ ఇంటర్ షిప్ ప్రోగ్రాంలు 8 నెలల పాటు అందరికీ ఖచ్చితంగా నేర్చుకునేలా చేయడం జరిగిందని, ఈ ఇంటర్ షిప్ ప్రోగ్రాంలు అన్ని దేశాలలోనూ ఉన్నాయన్నారు. మన వద్ద నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటర్న్ షిప్, ఎప్రెన్టీషిప్ చేయడం జరుగుతోందని, ఐదారేళ్ల అనంతరం కళాశాలలలో, పాలిటెక్నిక్ లలో, యూనివర్సిటీలలో చేసే కోర్సులలో అంతర్భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విద్యా విధానంలో కూడా మార్పులు తీసుకురావడం జరుగుతుందని, విద్యా విధానంలో భాగంగా కరికులం ఏ పరిశ్రమకు సరిపోతుంది, ఆ విధానంలోనే కరకులంలో కూడా మార్పులు చేయడం జరుగుతోందన్నారు. స్కిల్ హబ్స్ లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ రకమైన పరిశ్రమలు ఉన్నాయో చూసి ఆ పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. అందుచేత ప్రతి నియోజకవర్గంలో 100 శాతం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారన్నారు. చదువుకున్న వారందరూ స్వయం ఉపాధి తగ్గట్టుగా స్కిల్స్ సంపాదించుకోవాలని, దాని ద్వారా పది మందికి ఉపాధి అవకాశాలు చూపే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. 

 శాసనమండలి సభ్యులు ఇక్బాల్ గారు మాట్లాడుతూ ప్రస్తుత పారిశ్రామిక మరియు సాఫ్ట్వేర్ సంస్థల అవసరాల దృష్ట్యా  యువత మరియు విద్యార్థులు నూతన ఆలోచన ధోరణిని అలవరుచుకొని   మూస పద్ధతులకు దూరంగా , నూతన ఆవిష్కరణలకు దగ్గరగా వారి భావి భవితను తీర్చి దిద్దుకునే విధంగా   రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు  సంకల్పానికి ప్రతిరూపంగా ఈ స్కిల్ హబ్లు తీర్చిదిద్దుకున్నాయన్నారు. స్కిల్ హబ్ ఏర్పాట్లను, పనితీరును మరియుఅందువలన కలుగు ప్రయోజనాలను నమోదు చేయబడిన విద్యార్థులతో ముచ్చటించారు.

 ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర్లు ( మున్సిపల్ కమిషనర్ ), శ్రీ జబీవుల, శ్రీ బలరామిరెడ్డి, శ్రీమతి కళ్యాణి,శ్రీ సూర్యనారాయణ , శ్రీ నరసయ్య, శ్రీ షేక్ అబ్దుల్ ఖయ్యూం  మరియు స్థానిక కళాశాల ప్రిన్సిపల్ టి శ్రీనివాసులు పాల్గొన్నారు.


 

Comments