రాష్ట్రంలో చేపట్టిన వ్యవసాయ సంస్కరణల పట్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రశంసలు
• రైతు భరోసా కేంద్రాలు,పంటల బీమాపై ప్రత్యేక ప్రశంసలు
• నాలెడ్జ్ ట్రాన్సఫర్ పై ఎన్జిరంగా-ముర్ధోక్ విశ్వవిద్యాలయాల మధ్య ఎంఓయు
• ఎపిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పధకాలపట్ల ప్రత్యేక అభినందనలు
• విజ్ణాన యాత్రగా 10 రోజుల ఆస్ట్రేలియా పర్యటన విజయవంతం
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి
అమరావతి,14 అక్టోబరు (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పధకాల తోపాటు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన వివిధ సంస్కరణల పట్ల ఆస్ట్రేలియా వ్యవసాయమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారని రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్,ఆహార శుద్ధి శాఖామాత్యులు కాకాణి గోవర్ధనరెడ్డి వెల్లడించారు.10 రోజుల ఆస్ట్రేలియా పర్యటన విశేషాల గురుంచి శుక్రవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య ఎన్జిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.విష్టువర్ధన్ రెడ్డి సహా రిజిష్ట్రార్ మరి కొంత మంది సీనియర్ శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఈనెల 4వతేదీ బయల దేరి 5 నుండి 13వతేదీ వరకూ ఆస్ట్రేలియాలోని అడిలేడ్,సిడ్నీ,పెర్త్,మెల్బోర్న్ నగరాలలో పర్యటించినట్టు చెప్పారు.ప్రధానంగా ఇంటర్నేషనల్ కమీషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రేనేజ్ (ఐసిఐడి)అని పిలుస్తామని వారు ఒక ఇంటర్నేషనల్ సమావేశాన్నిఅడిలేడ్ లో నిర్వహించారని చెప్పారు.ఆసంస్థ సాధారణంగా రైతులకు,వ్యవసాయనికి సంబంధించి ఏవిధంగా యాజమాన్య పద్ధతులు పాటించి భూగర్భ జలాలు అడుకంటి పోకుండా సురక్షితంగా కాపాడుకోవడంతో పాటు రైతులకు సమగ్రంగా సాగునీటి అందంచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో చేయాలనే ఆలోచనతో ఆనేక సంస్కరణలు ప్రాక్టీసులు వాడుకలోకి తెచ్చారన్నారు.సంతోషించ దగ్గ విషయం ఏమంటే మన రాష్ట్రంలోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజికి హేరిటేజ్ అవార్డును ఇవ్వడం జరిగిందని తెలిపారు.చాలా కాలం క్రితం నిర్మించిన కట్టడాన్ని మనం కాపాడుకో కలిగాం కాబట్టి ఆ అవార్డును ఐసిఎడి సమావేశంలో అధ్యక్ష,కార్యదర్శులు అందించారన్నారని మంత్రి గోవర్ధనరెడ్డి తెలిపారు.ఒకసారి ఆస్ట్రేలియా పర్యటలో నేను గమనించింది మనం సంతోషించాల్సింది ఏమిటంటే ఎపిలో చేపట్టిన అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పధకాలు,వ్యవసాయ రంగంలో సియం జగన్మోగన్ రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలు గురించి వివరిస్తే ప్రతి ఒక్కరూ విని మనం చేస్తున్నకార్యక్రమాలతో మంచి పురోగతిని సాధిస్తున్నారని అందరు ప్రశంసలు కురిపించారని మంత్రి పేర్కొన్నారు.
అదే విధంగా పశ్చిమ ఆస్ట్రేలియాకు వెళ్ళినపుడు ఫెర్త్ లో వ్యవసాయ మంత్రి అలన్నా మాక్ టెర్నర్ కలిసినప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పారని ఇంత సమర్ధవంతంగా ఇంత సమగ్రంగా నాకు తెలిసి నేను కలిసిన వ్యవసాయ విభాగాల్లో ఎపిలో మరొకటి లేదని స్పష్టంగా చెప్పారని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు.అనేక సంస్కరణలు ఏమైతే తెచ్చామో వాటి గురించి ప్రజలకు చెప్పడం ఎపిలోనే కాకుడాం బయట కూడా ఎపి ఎంత అభివృద్ధిలో ఉందో చెప్పడానికి ఇదోక ఉదాహరణ అన్నారు.ముర్ధోక్ వ్యవసాయ విశ్వ విద్యాలయంతో టెక్నాలజీ,నాల్డెడ్జి ట్రాన్సఫర్ లో ఒప్పందం చేసుకోవడం జరిగిందని ముఖ్యంగా పిహెచ్ డిలో పరిశోధనలు చేసే వారికి అక్కడ అవకాశాలు కల్పించడం,ఫీజులో రాయితీలు ఇవ్వడంపై ఎంఓయు చేసుకోవడం జరిగిందన్నారు.అదే విధంగా ఆహారశుద్ధి రంగానికి సంబంధించి చాంబరు ఆఫ్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులను కలిసి పుడ్ ప్రాసెగింగ్ కు సంబంధించి మంచి అవకాశాలున్నాయని కావున ఆంధ్రప్రదేశ్ కు రావాలని విజ్ణప్తి చేశామని దానికి వారు సానుకూలత వ్యక్తం చేశారని పేర్కొన్నారు.ఒకసారి ఆలోచిస్తే మనం చేస్తున్న ఇక్రాపింగ్ విధానం ఎంత పారదర్శంకగా ఉంది డిజిటల్ అగ్రికల్చర్ లో ఎపి ఎంతో బ్రహ్మాండంగా మనం చేస్తున్నఇక్రాపింగ్ విధానం అమలు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే పరిస్థితి ఉందన్నారు.ఒన్ స్టాఫ్ సొల్యూషన్ రైతు భరోసా కేంద్రాలు దాదాపుగా ప్రపంచంలో ఎక్కడా ఉండే పరిస్థితి లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పియం కిసాన్ సమ్మాన్ నిధి సెంటర్లను ఏప్రిల్లో ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నారన్నారు.రైతు భరోసా కేంద్రాలు కాస్పెప్టు దేశంలో గాని ఇతర దేశాల్లో గాని రావడానికి మార్గదర్శకులు సియం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సి పరిస్థితి ఉందని అని చెప్పామన్నారు.పంటల బీమాకు సంబంధించి ఉచిత బీమాకు సంబంధించి ప్రీమియం రైతులు కట్టరా అని అడిగారు ఒక్కపైసా కూడా వారి నుండి కట్టించుకోమని అంతా ప్రభుత్వమే కడుతుందని చెప్పారు.అనేక పరిశోధనల గురించిన వివరాలను విసి వివరిస్తే అంతా ఆశ్చర్యపోయారన్నారు.ఇంకా ఈపర్యటనకు సంబంధించి ఇంకా అనేక విశేషాలను మీడియాకు వివరించారు.చివరగా ఆస్ట్రేలియా పర్యటనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డికి మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి కృతజ్ణతలు తెలిపారు.ఈసమావేశంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.విష్టువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
addComments
Post a Comment