నిలకడగానే తెప్పోత్సవ నిర్వహణ...... కలెక్టర్ ఢిల్లీరావు
విజయవాడ ఇంద్రకిలాద్రి : అక్టోబర్, 4 (ప్రజా అమరావతి);
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం 9వ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు మహిషాసుర మర్దని దేవి అంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం క్యూలైన్లలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
అనంతరం ఆలయ మీడియా వేదికపై విజయదశమి రోజున నిర్వహించే తెప్పోత్సవ నిర్వహణపై జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ నవరాత్రుల్లో బుధవారం రాజరాజేశ్వరిదేవి అలంకారములో భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాల ముగింపులో భాగంగా దుర్గమ్మను, గంగామాత సమేత మల్లేశ్వరస్వామివార్లలలో కృష్ణవేణి నదిమాతపై ఆనవాయితీ ప్రకారం జలవిహారం చేసే ఆచారం ఉందన్నారు. ఈ ఏడాది కృష్ణానదికి వరద నీరు ఉదృతిగా ఉన్నందున తెప్పోత్సవం నిర్వహణకు సాధ్యంకాదని జలనరులశాఖ అధికారులు తెలిపారన్నారు. ఈ పరిస్థితులలో నిలకడగానే శ్రీగంగా, దుర్గ అమ్మవార్ల సమేత మల్లేశ్వరస్వామి తెప్పోత్సవం భక్తులకు కనువిందు చేయనున్నదని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
జలవనరులశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్. తిరుమలరావు, రివర్ కన్జర్వేటర్ కృష్ణారావు మాట్లాడుతూ ఎగువ ప్రాంతాలైన శ్రీశైలంలో లక్షా 50 వేల క్యూసెక్కులు, నాగార్జున సాగర్ లో లక్ష క్యూసెక్కులు, పులిచింతలలో 90 వేల క్యూసెక్యులు నీటి నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుండి లక్ష 10 వేల క్యూసెక్కుల వరద నీటిని 70 గేట్లను రెండడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ఇదే పరిస్థితి రెండు నుండి మూడు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు.
addComments
Post a Comment