పూర్వీకులు గోవులను సంరక్షించుకుని పాలఉత్పత్తులను వాడడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు

 

విజయవాడ (ప్రజా అమరావతి);

** విజయవాడలో " ఆంధ్రా గోపుష్టి " బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభం.. 

** వినియోగదారులకు అందుబాటులో 27 రకాలైన పాల ఉత్పత్తులు.. 

** రైతు శ్రేయస్సే రాష్ట్ర శ్రేయస్సుగా నమ్మిన ముఖ్యమంత్రి డా. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..

** రూ. 17 కోట్ల 40 లక్షలతో 58 డా. వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలు ఏర్పాటు.. 

** రెండవ దశలో 50 డా. వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు..

- రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి డా. సీదిరి అప్పల రాజు..

- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి...     

రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్వచ్ఛమైన ఆవు పాలు మరియు పాల ఉత్పత్తులను " ఆంధ్ర గోపుష్టి " బ్రాండ్ తో పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి డా. సీదిరి అప్పల రాజు అన్నారు.  విజయవాడ పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో ఆంధ్ర గో పుష్టి రిటైల్ అవుట్ లెట్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మంగళవారం ప్రారంభించారు.   

దేశవాళీ జాతులు అంతరించిపోకుండా గోజాతులను పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 58 డా. వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలను ప్రారంభించారని మంత్రి అన్నారు.  జాయింట్ లయబిలిటీ గ్రూప్ ల ద్వారా ఏర్పాటు చేసిన దేశీయ గోజాతుల పెంపక కేంద్రాల సభ్యులు డైరెక్టర్ లుగా ఉంటూ పాలు, పాల ఉత్పత్తులను " ఆంధ్ర గోపుష్టి " బ్రాండ్ పేరుతో వినియోగదారులకు అందుబాటు ధరలో అందించడం జరుగుతుందని మంత్రి అప్పల రాజు అన్నారు.  రెండవ దశగా 50 డా. వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.   

విజయవాడ నడిబొడ్డున ఆంధ్ర గోపుష్ట్రి బ్రాండ్ తో ఆవుపాలు మరియు పాలఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు.  ప్రతి వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రంలో అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని ఇంచార్జి గా నియమించామన్నారు.    రైతులకు, వినియోగదారులకు మేలైన పరిస్థితులు కల్పించే విధంగా ఈ ఉత్పత్తులను అందుబాటులోనికి తీసుకువచ్చామన్నారు.  ఈ కేంద్రంలో 27 రకాలైన గో ఉత్పత్తులైన పాలు, నెయ్యి, పన్నీరు, పెరుగు, మజ్జిగ మొదలగు ఉత్పత్తులతో పాటు A2 ఆవు పాలతో తయారు చేసిన టీ, కాఫీ, బాదం పాలు మొదలగు పానీయాలు ఈకేంద్రంలో వినియోగదారులకు అందుబాటులో ఉంచామన్నారు.  

దేశంలోనే ప్రప్రధమంగా సేంద్రీయ పద్దతులతో A2 పాలు మరియు పాలఉత్పత్తులు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా దేశీయ గో జాతులను పరిరక్షించడమే కాకుండా వాటికీ మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.  ప్రభుత్వం మొదటి దశగా రూ. 17 కోట్ల 40 లక్షలతో 58 వై.ఎస్.ఆర్ దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేసి పాడిరైతులకు తగిన శిక్షణ అందిస్తున్నామన్నారు.  ఎటువంటి రసాయనిక ఎరువులు, యాంటీ బయాటిక్స్ వాడకుండా సేంద్రీయ పద్దతుల ద్వారా ఉత్పత్తి చేసిన ఈపాలు మరియు పాలఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ పూర్వీకులు గోవులను సంరక్షించుకుని పాలఉత్పత్తులను వాడడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని ప్రస్తుత కాలంలో దేశవాళీ జాతులు అంతరించిపోతున్న తరుణంలో ప్రభుత్వం దేశీయ గోజాతులను సంరక్షించేందుకు వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలను ప్రారంభించి రైతులను ప్రోత్సహిస్తున్నదన్నారు.   ఆవు నెయ్యిని ఆయుర్వేద శాస్త్రంలో అమృతం అని పిలుస్తారన్నారు.  మూడున్నరేళ్ల ప్రభుత్వ పాలనలో రైతు శ్రేయస్సును రాష్ట్ర శ్రేయస్సుగా నమ్మి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారన్నారు.  రైతులు తమ కాళ్ళ మీద నిలబడి వ్యవసాయంలో మెరుగైన ఫలితాలను సాధించే విధంగా మెరుగైన ఆదాయం పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పధకాలను అమలు చేస్తున్నదన్నారు.  రైతుకు స్థిరమైన ఆదాయం కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.  రాష్ట్రం పచ్చగా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు వ్యవసాయంతో పాటు పశుసంపదను కూడా వృద్ధి చేసుకోవాలన్నారు.  పూర్వీకులు గోవులను సంరక్షించడంతో పాటు గో ఉత్పత్తులను వినియోగించేవారని అందువల్లనే వారు ఆరోగ్యంగా ఉన్నారన్నారు.  విజయవాడ నడిబొడ్డులో ఆంధ్ర గోపుష్టి బ్రాండ్ తో రైతులే యజమానులుగా పాలు, పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉన్నదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. పూనం మాలకొండయ్య, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. ఆర్. అమరేంద్రకుమార్, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు జాయింట్ లయబిలిటీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.     


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image