కృష్ణపట్నం పోర్ట్ ప్యాకేజీ - నగదు పంపిణీ ప్రత్యేక స్టోరీ:
* ఈ నెల 27వ తేదీన కృష్ణపట్నం పోర్టు పరిధిలోని గ్రామాల మత్స్యకారేతర కుటుంబాల నిర్వాసితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్థిక సహాయం పంపిణీ.
* ఎంతో కాలంగా ముత్తుకూరు మండల వాసులు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది.
* రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాల వారిని వివిధ సంక్షేమ పధకాల ద్వారా ఆదుకుంటున్నది.
2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27వ తేదీన కృష్ణపట్నం పోర్టు పరిధిలోని గ్రామాల మత్స్యకారేతర కుటుంబాల నిర్వాసితులకు (తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు) ఒక్కొక్కరికి రూ. 25,000/- లు చొప్పున అందజేసేందుకు జిల్లా యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు చేసింది..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, నేలటూరు శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం ౩వ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కృష్ణపట్నం పోర్టు ప్యాకేజి కింద మత్స్యకారేతర కుటుంబాల నిర్వాసితులకు ఆర్ధిక సహాయం అందజేయడం జరుగుతున్నది.
కృష్ణపట్నం ఓడరేవు అభివృద్ధి దృష్ట్యా, పునరావాసం క్రింద సమీప గ్రామాల నివాసితులను ముత్తుకూరులో పునరావాసం కల్పిస్తూ, సామాజిక ఆర్థిక సర్వే సమయంలో, సమర శంఖారావం సమయంలో మరియు క్షేత్ర స్థాయిలో పరిశీలనా తర్వాత, 16128 మంది మత్స్యకారేతర కుటుంబాలకు (తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు) ఒక్కొక్కరికి రూ. 25,000/- చొప్పున ప్యాకేజీ మంజూరు చేయుటకు G.O.Ms.No.9, Dt.10.09.2022 ( Infrastructure & Investment (Ports.I) Department ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో రూ.25,000/-లు చొప్పున 12942 కుటుంబాలకు రూ.32,35,50,000/-లు పంపిణీ చేయడం జరుగుతున్నది. గతములో రూ.14350/- చొప్పున 3186 మందికి చెల్లించి యున్నందున, వారికి మిగిలిన మొత్తము అనగా రూ.10,650/-లు ప్రస్తుతం చెల్లించుటకు ఏర్పాట్లు చేసారు. ప్రస్తుతం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిచే పై లబ్ధిదారుల ఖాతాలకు ఆ మొత్తము అనగా రూ.35,74,80,900/- ( అక్షరములా ముప్పై ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యనబై వేల తొమ్మిది వందలు రూపాయలు మాత్రమే ) జమచేయబడుతున్నది.
1).రూ.25,000/-చొప్పున :12942 మందిలబ్దిదారులు.
2). రూ.10,650/-చొప్పున
: 3186 మంది లబ్దిదారులు.
మొత్తము లబ్దిదారులు : 16128 మంది లబ్దిదారులు
చెల్లించుచున్న మొత్తము : రూ.35,74,80,900/-లు.
addComments
Post a Comment