భవనాల నిర్మాణంలో అలసత్వం ఉండరాదు జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

 భవనాల నిర్మాణంలో అలసత్వం ఉండరాదు


జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్




ఆమడగురు,అక్టోబర్ 28 (ప్రజా అమరావతి):


భవనాల  నిర్మాణంలో అలసత్యం ఉండరాదని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం  మడకశిర నియోజకవర్గం 

లోనిఅమడగూరు మండలంలో జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్   ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం పనులు పరిశీలించారు మండలంలోని జౌకలకొత్తపల్లి ,పూలకుంటపల్లి,చినగానిపల్లి,కస్సముద్రం గ్రామ పంచాయితీలోని నూతన సచివాలయ,ఆరోగ్య కేంద్రాలు,రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  నవంబర్ నెల ఆకరికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్లు కు సూచించారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు తదితర భవన నిర్మాణాలను చేపడుతోందన్నారు.  

ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు ఇప్పటినుంచి 9 వారాల్లోగా అన్ని రకాల భవన నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు. భవనాల నిర్మాణంలో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. ఇప్పటివరకు భవనాల నిర్మాణంలో పురోగతి తక్కువగా ఉందని, పూర్తయ్యే దశలో ఉన్న నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని చెబుతున్నా పూర్తి చేయడం లేదని, ఇది ఎంత మాత్రం తగదన్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయడం లేదని, సంబంధిత అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి భవన నిర్మాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. ఇసుక, సిమెంట్ లేదనో, ఇతర కారణాలతో భవనాల నిర్మాణం నిదానంగా జరగడానికి వీలులేదని, నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. గత నెలలో, ఈ నెలలో కేటాయించిన లక్ష్యాలను ఇంకా పూర్తి చేయలేదని, వెంటనే లక్ష్యాలను చేరుకునేలా అధికారులు పని చేసి నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ఆయా కాంట్రాక్టర్లు భవనాలకు సంబంధించిన బిల్లులను  ప్రతి నెల 20 తేది లోపు అప్లోడ్ చేయాలని, 26వ తేదీ లోపల మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నగదును  జమ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా భవనాల నిర్మాణంలో పురోగతి చూపించి నిర్దేశిత సమయంలోగా అన్ని భవన నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.*

ఈ కార్యక్రమంలో పి ఆర్  ఎస్సీ ఈ గోపాల్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఈ రషీద్, ఎమ్మార్వో రెడ్డి శేఖర, ఎంపీడీవో నసీం, ఏ ఈ పి ఆర్ గుప్తా, ఆర్డబ్ల్యూఎస్  ఏఈ  అనిల్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు



Comments