నెల్లూరు అక్టోబర్ 17 (ప్రజా అమరావతి):
ఈనెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ జెన్కో మూడవ యూనిట్ ప్రారంభించేందుకు జిల్లాకు రానున్న దృష్ట్యా పర్యటన ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బి. శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం తొలుత ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బి. శ్రీధర్ జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, జిల్లా పోలీసు అధికారి శ్రీ సిహెచ్ విజయ రావు
ఏపీ జెన్కో రాష్ట్ర డైరెక్టర్ శ్రీ చంద్రశేఖర్ రాజు లతో కలసి శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ మూడో యూనిట్ పరిధిలో సిబ్బంది క్వార్టర్ల సమీపంలో హెలిప్యాడు, బహిరంగ సభ వేదిక స్థలాలను, నిర్మాణంలో ఉన్న పైలాన్ ను పరిశీలించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకల గురించి వారు చర్చించారు. వర్షాలు పడే సూచన ఉన్నందున అందుకు తగినట్టుగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం ఏపీ జెన్కో పరిపాలన భవనం సందర్శించి అక్కడ ఏర్పాటుచేసిన థర్మల్ పవర్ స్టేషన్ నమూనాను పరిశీలించారు.
తదుపరి మూడవ యూనిట్ సెంట్రల్ కంట్రోల్ గదిని వారు పరిశీలించారు.
తదనంతరం ఏపీ జెన్కో ఎండి జిల్లా కలెక్టర్ ఎస్పీ లతో కలిసి ఏపీ జెన్కో అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
చిత్రపటం ద్వారా ఏపీ జెన్కో ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏపీ జెన్కో ఎండి మాట్లాడుతూ హెలిప్యాడు, బహిరంగ సభ, పార్కింగ్ తదితర ప్రదేశాల్లో ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు
. ఆర్ అండ్ బి మార్గదర్శకాల ప్రకారం హెలిప్యాడు నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. బహిరంగ సభ ఏర్పాటు కోసం మరొక అనువైన స్థానాన్ని పరిశీలించి రేపటిలోగా నిర్ధారించాలన్నారు. మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీకి కూడా ఏర్పాట్లు చేయాలన్నారు.
తదుపరి ఏపీ జెన్కో కార్మికుల తరఫున జేఏసీ నాయకులు ఏపీ జెన్కో ఎండి,జిల్లా కలెక్టర్ ను కలసి ఏపీ జెన్కోను ప్రైవేటీకరణ చేయవద్దని తమను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని తదితర డిమాండ్లతో వినతి పత్రం అందజేశారు. దీనిపై ఏపి జెన్కో ఎండి మాట్లాడుతూ ఏపీ జెన్కోను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారని తెలియజేశారు. శాశ్వత ఉపాధి కల్పనకు కృషి చేస్తామని చెప్పారు.
ఈ పర్యటనలో వారి వెంట ఏపీ జెన్కో సి ఇ శ్రీ నాగరాజు, ఎస్.ఈ.లు శ్రీ వెంకటేశ్వరరావు, శ్రీ మధుసూదన్ రావు, శ్రీ జగన్నాథం, శ్రీ చౌదరి నెల్లూరు ఆర్డిఓ శ్రీ మలోల, నుడా వైస్ చైర్మన్ శ్రీ టీ బాపిరెడ్డి, ఏఎస్పీ శ్రీ శ్రీనివాసరావు,ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీమతి మాధవి సుకన్య, డీఎస్పీ శ్రీ హరినాథ్ రెడ్డి, తహసిల్దార్ శ్రీ మనోహర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment