ప్లాస్టిక్ నిర్మూలనకు నడుం బిగించాలి

 ప్లాస్టిక్ నిర్మూలనకు నడుం బిగించాలి*


*: నవంబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్ల నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలి*


*: ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్లని వినియోగిస్తే జరిమానాలు తప్పవు*


*: జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్య సాయి జిల్లా), అక్టోబర్ 19 (ప్రజా అమరావతి):


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో నవంబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్ల నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నవంబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్ల నిషేధంపై ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్ లు, పరిశ్రమల శాఖ అధికారులు, కాలుష్య నియంత్రణ అధికారి, చేనేత జౌళి శాఖ, ఎల్డిఎం, ప్లెక్సీ ప్రింటర్ల యజమానులు, తదితరులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. వచ్చే నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్ల నిషేధం నిర్ణయం తీసుకున్నారని, ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్ల నిషేధానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ప్లెక్సీ ప్రింటర్ల యజమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్లను ప్రింట్ చేయరాదన్నారు. ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్లని వినియోగిస్తే జరిమానాలు తప్పవన్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల తయారు చేసే యజమానులు సాంకేతికను అందిపుచ్చుకుని కాటన్ క్లాత్ బ్యానర్ల తయారీని ముద్రలకు వినియోగించేలా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అవసరమైతే కాటన్ క్లాత్ బ్యానర్ల తయారీపై సంబంధిత శాఖల అధికారులు యజమానులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. ఎవరూ కూడా ప్లాస్టిక్ ఫ్లెక్సీ మెటీరియల్‌ని తయారు చేయకూడదని, దిగుమతి చేయకూడదన్నారు. ఏ రకమైన ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్‌లను ముద్రించకూడదని, ఉపయోగించకూడదన్నారు.  ఆరోగ్య అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, వార్డు శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీలతో సహా మున్సిపల్ కమిషనర్‌లు పట్టణ ప్రాంతాల్లో అన్ని రకాల ప్లాస్టిక్ బ్యానర్‌ల వినియోగం, రవాణా మరియు ప్రదర్శనపై నిషేధాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను ఉపయోగిస్తే వారికి ప్రతి చదరపునకు 100 రూపాయల చొప్పున జరిమానా విధించాలన్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధ నోటిఫికేషన్‌పై రాజకీయ ప్రతినిధులు, కార్పొరేట్ విద్యాసంస్థలు, వివాహాలు, ఇతర కార్యక్రమాల నిర్వాహకులకు అవగాహన  మరియు 2017 పరీక్ష రోజు మీటింగ్ లకు హౌ ఆర్ యుకల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు కాటన్ క్లాత్ ల వినియోగాన్ని చేసేలా ప్రోత్సహించేలా చూడాలన్నారు. ఈ విషయమై ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా కృషి 3000 పనిచేయుచున్నారు పనిచేయుచున్నారు చేయాలన్నారు. అధికారులు కూడా ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టిన ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను ఉపయోగించరాదని, ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ లను తొలగించాలన్నారు.


 ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు భాగ్యరేఖ, తిప్పేనాయక్, రాఘవేంద్ర, ఏపీపీసీబీ ఎన్విరాన్మెంటల్ అధికారి శంకర్రావు, ఎల్డిఎం సాయినాథ్ రెడ్డి, చేనేత జౌళి శాఖ ఎడి రమేష్, పరిశ్రమల శాఖ జిఎం చాంద్ భాష,  హిందూపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ధర్మవరం మున్సిపల్ కమిషనర్  మల్లికార్జున రావు, మడకశిర, పెనుగొండ, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ లు పాల్గొన్నారు జిల్లా ఫ్లెక్సీ ప్రింటింగ్ సంఘం ప్రతినిధులు మంజునాథ్ రెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.



Comments