గ్రామ సచివాలయం, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ భవనాలు ప్రారంభం..




 *చౌడేపల్లి,పులిచర్ల మండలాల్లో గ్రామ సచివాలయం, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ భవనాలు ప్రారంభం..* 



*పాలన సంస్కర ణల్లో భాగంగా ప్రజలకు సత్వర సేవలు అందించేం దుకు సచివాలయా లు, రైతు భరోసా కేంద్రాలు,వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు కు గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు:* 


              *రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు* 


చౌడేపల్లి/పులిచెర్ల (ప్రజా అమరావతి): 


గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాలన లో విప్లవాత్మక మా ర్పులు తీసుకొని వచ్చి ప్రజల ఇంటి ముంగిటికే ప్రభుత్వ సేవలు అందించేందు కు గ్రామ సచివాల యాలు,రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగు తున్నదని రాష్ట్ర అటవీ, విద్యు త్, పర్యావరణ శాస్త్ర, సాంకేతిక శాఖ  మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు.


మంత్రి జిల్లా పర్య టనలో భాగంగా 

పుంగనూరు నియో జక వర్గ పరిధిలోని చౌడేపల్లి మండలం దిగువ పల్లి క్రాస్ వద్ద మరియు కొండామర్రి, ఆమని గుంట వద్ద గ్రామ సచివాలయ భవనం, వైయస్సార్ రైతు భరోసా కేంద్రం డాక్టర్ వైయస్సార్ వెల్నెస్ సెంటర్ లను పులిచెర్ల మండలం కల్లూరులో గ్రామ సచివాలయం,పులి చెర్లలో రైతు భరోసా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. 


👉🏿 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఒక్కొక్క సచివాలయ భవనం రూ.40 లక్షలతో,  ఒక్కొక్క వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం 

రూ.21.80 లక్షలతో, ఒక్కొక్క డాక్టర్ వైఎస్ఆర్ వెల్ నెస్ సెంటర్ రూ.17.50 లక్షలతో నిర్మించడం జరిగింది.


ఈ కార్యక్రమాలలో తంబళ్లపల్లి శాసన సభ్యులు ద్వారక నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమా ర్, రాష్ట్ర జానపద కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగ భూష ణం,రాష్ట్ర పాల ఏకి రి కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్,చిత్తూరు ఆర్ డి ఓ రేణుకా,డి పి ఓ లక్ష్మీ,తహసిల్దా ర్లు మాధవరావు,అ మర్నాథ్, ఎం పి డి ఓ లు సుధాకర్ రా వు,సుగుణమ్మ, నా యకులు పెద్దిరెడ్డి,  ఎం పి పి లు, జడ్పీ టీసీ లు,ఇతర సం బంధిత అధికారు లు, ప్రజాప్రతినిధు లు పాల్గొన్నారు..



Comments