*ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్ల నిషేధం అమలు చేసేందుకు చర్యలు*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), అక్టోబర్ 20 (ప్రజా అమరావతి):
జిల్లాలో ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్ల నిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్ల నిషేధం విషయమై ఇప్పటికే ప్లెక్సీ ప్రింటర్ల యజమానులతో సమావేశం నిర్వహించి తెలియజేయడం జరిగిందని ఎన్విరాన్మెంటల్ మరియు ఫారెస్ట్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ వివరించారు.
గురువారం విజయవాడ నుంచి ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యాన్ పై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఎన్విరాన్మెంటల్ మరియు ఫారెస్ట్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ కె.కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లెక్సీ ప్రింటర్ల యజమానులతో బుధవారం ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యాన్ పై సమావేశం నిర్వహించడం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్లను ప్రింట్ చేయరాదని వారికి తెలియజేశామన్నారు. ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యానర్లని వినియోగిస్తే జరిమానాలు తప్పవని, ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల తయారు చేసే యజమానులు సాంకేతికను అందిపుచ్చుకుని కాటన్ క్లాత్ బ్యానర్ల తయారీని ముద్రలకు వినియోగించేలా అవగాహన పెంపొందించుకోవాలని వివరించామని తెలిపారు. కాటన్ క్లాత్ అప్గ్రేడ్ చేయడాని కోసం రుణాలు అందించాలని ప్లెక్సీ ప్రింటర్ల యజమానులు కోరడం జరిగిందని వివరించారు. అదనపు రుణాలు అందిస్తే సహాయకారంగా ఉంటుందని వారు కోరడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం ఎస్ఎల్బీసీ ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పరిశ్రమల శాఖ జిఎం చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
నాడు - నేడు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు :
గురువారం విజయవాడ నుంచి విద్యా శాఖలో అమలవుతున్న మనబడి నాడు - నేడు పనులు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, తదితర అంశాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నాడు -నేడు స్పెషల్ కమీషనర్ కాటమనేని భాస్కర్, నాడు- నేడు ఇన్ఫ్రా మురళి, విద్యాశాఖ డైరెక్టర్ సురేష్ కుమార్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ కె.కార్తీక్, డీఈఓ మీనాక్షి, తదితరులు పాల్గొన్నారు.*
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనబడి నాడు - నేడు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న అన్ని రకాల కార్యక్రమాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
addComments
Post a Comment