ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే చంద్రబాబు పోరాటాలకు మద్దతుగా నిలవండి



 *- ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే చంద్రబాబు పోరాటాలకు మద్దతుగా నిలవండి*


 

 *- పవన్ ను బాధపెట్టడంపై చలించిన చంద్రబాబు* 

 *- సంఘీభావం తెలిపేందుకు వస్తే విమర్శలెందుకు* 

 *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 


 గుడివాడ, అక్టోబర్ 18 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసే పోరాటాలకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ పిలుపునిచ్చారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్ళారని తెలిపారు. అక్కడ పవన్ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారన్నారు. విశాఖ నుండి వెళ్ళిపోయేంత వరకు వేధించడం చూసి చంద్రబాబు ఎంతగానో చలించిపోయారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు బాధాకరమంటూ పవన్ కళ్యాణ్ కు సంఘీభావం చెప్పేందుకు చంద్రబాబు వచ్చారన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల మనుగడను కాపాడుకోవడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య చర్చ జరిగిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన అనంతరం సిద్ధాంతాలు, ఆలోచనలు, పోరాట వ్యూహాలపై అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారని తెలిపారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్మోహనరెడ్డిని కదిలించలేరని. వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు సంఘీభావం తెలిపేందుకు కలిస్తేనే వైసీపీ నేతలు భయపడుతున్నారని తెలిపారు. వీరిద్దరూ ఎక్కడ కలిసి వస్తారోనన్న భయం వైసిపి నేతల్లో కనిపిస్తోందన్నారు. కలిసి వచ్చినా జగన్ ను కదిలించలేరన్నప్పుడు

175 స్థానాల్లో ఒంటరిగా పవన్ కళ్యాణ్ ను ఎందుకు రమ్మంటున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు సిద్దాంతాలు లేవని చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు పెట్టి అణచి వేస్తున్నారని, అధికారం శాశ్వతం కాదన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో అమరావతి రైతులు అమరావతి నుండి అరసవల్లి వరకు మహా పాదయాత్రను చేపట్టారని తెలిపారు. హైకోర్టు అనుమతితో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని, అయినప్పటికీ రాష్ట్రంలో రక్షణ లేని పరిస్థితి నెలకొందన్నారు. అమరావతి రైతులపై కూడా దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని శిష్ట్లా లోహిత్ హెచ్చరించారు.

Comments