నెల్లూరు, అక్టోబర్ 23 (ప్రజా అమరావతి): గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా గ్రామాల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్యలు
చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం దువ్వూరువారిపాలెం, దమ్మాయ పాలెం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. తొలుత దువ్వూరి వారి పాలెం గ్రామంలో ఎప్పటి నుంచో గ్రామస్తులు ఎదురుచూస్తున్న దువ్వూరి వారి పాలెం నుంచి గుంటకట్ట వరకు రహదారి నిర్మాణానికి మంత్రి కాకాణి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి వివరించారు.
ముందుగా ఈనెల 27న జెన్కో మూడో యూనిట్ ప్రారంభానికి ముఖ్యమంత్రి విచ్చేస్తున్న సందర్భంగా నేలటూరు సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. నూడా సాధారణ నిధులు రూ. 44 లక్షలతో దువ్వూరు వారి పాలెం నుంచి గుంటకట్ట వరకు పొలాల మధ్య రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసామని, మరో రెండు మాసాల్లో ఈ రహదారి నిర్మాణం పూర్తవుతుందన్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నాని ఫిషర్ మెన్ ప్యాకేజీని కూడా ఈనెల 27న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ముత్తుకూరు మండల ప్రజలకు అందజేస్తామని, 25 కోట్లతో మత్స్యకారులకు మినీ ఫిషింగ్ హార్బర్ ను కూడా నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో చరిత్రలో నిలిచిపోయే పనులు తాను మంత్రిగా ఉండగా చేపట్టడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అన్ని విధాల ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించడం వల్లే ఆ గ్రామాల సమస్యలు తెలుసుకొని సకాలంలో పరిష్కరించగలుగుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నుడా వైస్ చైర్మన్ శ్రీ బాపిరెడ్డి, ఎంపీపీ శ్రీమతి గండవరపు సుగుణమ్మ, సర్పంచ్ కృష్ణవేణి, ఎంపీడీవో ప్రత్యూష, తహసీల్దార్ మనోహర్ బాబు, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment