కె. గంగవరం (ప్రజా అమరావతి);
మహిళా సంక్షేమ మే ద్యేయంగా పామర్రు శ్రీరాంనగర్ లో మహిళల కోరిక మేరకు అంగన్వాడీ కేంద్రం నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.
శనివారం కె గంగవరం మండల పామర్రు గ్రామంలోని శ్రీరాంనగర్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం లో భాగంగా స్థానికంగా వచ్చే సమస్యలు పరిష్కరించే విధంగా కృషి జరుగుతోందని న్నారు.
స్థానిక మహిళల అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకు రావడం తో వెంటనే స్పందించి కె గంగవరం ఎంపీడీఓ తో మాట్లాడి ప్రభుత్వ స్థలం లో అంగన్వాడీ కేంద్రం నిర్మించాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వపరంగా అందుతున్న లబ్ధి వారు వినియోగిస్తున్న తీరు తో పాటు సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు .
ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్లు కట్టించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం మంత్రి నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వారికి అందుతున్న ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, ఆసరా, పెన్షన్, కాపు నేస్తం తదితర సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న తీరును అడిగి తెలుసుకుని, సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పామర్రు గ్రామ సర్పంచి వాసంశెట్టి దుర్గ, ఎంపీపీ పంపన నాగమణి, జడ్పీటీసీ ఓ.రాజకుమారి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పండు గోవిందు, ఎంపీడీఓ శ్రీనివాస్ ,కె.గంగవరం తహసీల్దార్ వైద్యనాధ శాస్త్రీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ,వాలంట్రీలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment