మహాత్మాగాంధీ ప్రభోదించిన సత్యం, అహింసా మార్గంలో నడవడం ద్వారా సమాజానికి ఎంతో మేలు

 

 రామచంద్రపురం

అక్టోబర్ 2 (ప్రజా అమరావతి);


మహాత్మాగాంధీ ప్రభోదించిన సత్యం, అహింసా మార్గంలో నడవడం ద్వారా సమాజానికి ఎంతో మేలు


జరుగుతుందని, అలాంటి మహనీయుని జన్మదినాన్ని స్మరించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యతనీ రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు.

 

అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంత్రి రామచంద్రపురం పురపాలక సంఘం వద్ద నున్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య మే ప్రగతి కి మూలమని, అహింసే ఒక ఆయుధం గా చేపట్టి దేశానికి స్వేచ్ఛా, స్వతంత్రo తీసుకొనివచ్చిన మహనీయుని గా మహాత్మాగాంధీ సేవలను కొనియాడారు.

గాంధీజీ ఆశీయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల సుపరిపాలన కు నాంది పలికారన్నారు. స్వచ్ఛ, స్వేచ్ఛ,సేవ,స్నేహ రామచంద్రపురాన్నీ తీర్చిదిద్దదమే ద్యేహం గా ముందుకు వెళుతున్నట్టు మంత్రి తెలిపారు. దీనికోసం ప్రతిఒక్కరు ముందుకురావాలని పిలుపునిచ్చారు.

 ఈ సందర్భంగా ముచ్చుపల్లి లో వంతెన నుండి స్వచ్ఛత అమృత్ మహోత్సవ కార్యక్రమంలో పాలకొని పారిశుద్ధ్య పనులు చేసి స్వచ్చత గురించి స్థానికులకు మంత్రి వివరించారు.

DIPRO, అమలాపురం.



ఐటమ్..2


రామచంద్రపురం లోని మునిసిపల్ పాఠశాలలో అదనపు తరగతి గదులకు శంఖుస్థాపన చేసిన మంత్రి.


రాష్ట్రంలో  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ఉన్నత మైన్ సౌకర్యాలతో చదువుకునే విధంగా  ముఖ్యమంత్రి ప్రణాళిక బద్ధంగా వెళుతున్నారని మంత్రి తెలిపారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయి అన్నారు. ఇంగ్లీష్ బాష ను ప్రోత్సహించడం తో పాటు, చదువు కునే పిల్లలకు 3 జతల బట్టలు, షూ, బాగ్, పుస్తకాలూ ఉచితం గా ఇవ్వడం జరుగుతోందన్నారు. పోటీ  ప్రపంచంలో మన పిల్లలు పోటీ పడే విధంగా 8 వ తరగతి చదివే పిల్లలకు నలభై వేల రూపాయల విలువ గల బీజస్ తో కూడిన టాబ్ ను ముఖ్యమంత్రి అందిస్తున్నారని మంత్రి తెలిపారు. కళాశాలలో వినియోగించే ఈ టాబ్ లు పాఠశాలల్లో ప్రవేశపెట్టడం ఒక వరమని మంత్రి పేర్కొన్నారు. 


 ఈ సందర్భంగా మంత్రి రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని చింతపల్లి మునిసిపల్ హైస్కూల్ లో 52 లక్ష ల రూపాయల తో నిర్మించ తలపెట్టిన 5 అదనపు తరగది గదులకు శంఖుస్థాపన చేశారు. 

అదేవిధంగా రత్నం పేట హై స్కూల్ లో 84 లక్ష రూపాయల తో 6 తరగతి గదులకు శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పాఠశాలలో ఏర్పాటు చేసిన మంచి నీటి ట్యాంక్ అపరిశుభ్రంగా ఉండడంతో సంబంధించిన సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి నిత్యము శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో చైర్మన్ గదాం శెట్టి శ్రీదేవి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 

Comments