*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమాచార శాఖ మంత్రి
*
తిరుమల, అక్టోబర్ 04 (ప్రజా అమరావతి): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2022 లో భాగంగా మంగళవారం ప్రాతః కాల సమయంలో శ్రీవారిని సేవించి దర్శించుకున్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ. ఉదయం 7 గంటలకు ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి రథోత్సవంలో పాల్గొన్న అనంతరం తిరుమల నుండి రేణిగుంట విమానాశ్రయం కు చేరుకుని తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి వీడ్కోలు పలికిన వారిలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, ABCWO లు గూడూరు నాయుడుపేట వెంకటేష్, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.
addComments
Post a Comment