గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధిద్ధాం



*గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధిద్ధాం


*



పార్వతీపురం / సాలూరు, అక్టోబర్ :2 (ప్రజా అమరావతి); జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధిద్దామని డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర పిలుపు నిచ్చారు. ఆదివారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సాలూరు తసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి అహింసామార్గంలో స్వాతంత్య్రం సముపార్జించిపెట్టిన సత్యాగ్రహ సేనాని జాతిపిత మహాత్మాగాంధీ అని కొనియాడారు. తన జీవితాన్నే ప్రయోగశాలగా మార్చుకుని సత్యశోధన చేసిన మహా జ్ఞాని బాపూజీ అన్నారు. మహాత్మాగాంధీ జీవితం  ప్రపంచానికే ఆదర్శనీయం, ఆచరణీయమన్నారు. గాంధీజీ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. బుడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సచివాలయ వ్యవస్థతో ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని, రైతుల అభ్యున్నతికి సహితం కృషిచేసి మహాత్ముని అడుగుజాడల్లో  ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తుందని మంత్రి వివరించారు.


ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, అనధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Comments