మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతు మెడకు ఉరితాళ్లు బిగించినట్లే.

 అమరావతి/మంగళగిరి (ప్రజా అమరావతి);


_తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం మాట్లాడుతూ 


రైతుల మోటార్లకు మీటర్లు బిగించడాన్ని విరమించుకోవాలి.

 రైతుల మోటార్లకు మీటర్లు బిగించడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. 

గురువారం ఆయన  మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన వివరాలు, ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...!*_

 రాష్ట్రంలో జగన్ అండ్ కంపెనీ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనమని నమ్మింప చూస్తున్నారు. 

 అపద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారు.  మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియలో వెనక్కి తగ్గేదే లేదు అనే రీతిలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. 

 మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతు మెడకు ఉరితాళ్లు బిగించినట్లే. 


 సీఎండీ నాగార్జునరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లు  మోటార్లు కు మీటర్లు బిగిస్తే రైతులకు లాభం చేకూరుతుందని చెప్పడం శుద్ధ అబద్ధం. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలి. జీవో నెం 50 ద్వారా ఒప్పందం చేసుకున్నామని చెప్పడం ఒట్టి బూటకం, మీటర్లు పెట్టడం మంచేదే అని ఎలాగైనా రైతులు నమ్మేలా చేయాలని చేస్తున్నారు. 

 తెలుగుదేశం పార్టీ, అనుబంధ రైతు విభాగం, ప్రజాస్వామ్యవాదులు దీన్ని తీవ్రంగా ఖండిస్తు్న్నారు. 

 మోటార్లకు మీటర్లు బిగించడం మోసపూరితం. 

 మోటార్లకు మీటర్లు బిగించే పని పూర్తి చేయడానికి జగన్ నానా తంటాలు, నానా హైరానా పడుతున్నాడు. 

 మీటర్లు బిగించుకుంటే రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని చెప్పడం సమంజసం కాదు. 

 పైలెట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ మీటర్లు బిగించిన శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ రైతు విభాగం బృందం, నిపుణులు వెళ్లి చూశారు. 

 జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పర్యటించి రైతులతో మాట్లాడాం.  మీటర్లు పెట్టడంవల్ల మార్పేమీ లేదని, బిల్లులు చూస్తే భయమేస్తోందని రైతులు వాపోయారు. 

 నాణ్యమైన కండక్టర్, కొత్త ట్రాన్స్ ఫార్మర్ లు, కొత్త సబ్ స్టేషన్లు పెడితే రైతులకు నాణ్యమైన విద్యుత్ లభిస్తుంది తప్ప.. మీటర్లు బిగిస్తే లభించదు.  

 మెడపై తల ఉన్నవాడెవడూ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని అంగీకరించడు.  

 రైతుకు భారమయ్యే మీటర్లు బిగించడానికి జగన్  ఎందుకంత తపన పడుతున్నారు? 

 కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎఫ్ఆర్ బీఎం నిబంధనలు దాటి రాష్ట్రం అప్పులు చేసింది. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది.

 కొత్తగా అప్పులివ్వాలంటే పెట్టిన కండీషన్లలో మోటార్లకు మీటర్లు బిగించడం కూడా ఒక షరతు.24 వేల కోట్లు అప్పుల కోసం రైతాంగాన్ని, రైతు ప్రయోజనాలను పణంగా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది.  

 ప్రభుత్వం క్విడ్ ప్రోకో సిద్ధాంతాన్ని పాటిస్తోంది. జగన్.. మీకేంటి? నాకేంటీ? అనే ధోరణితో ముందుకు సాగుతున్నాడు. తండ్రి శవంతో లాభం, బాక్సైట్, ఇసుక, సారా బట్టీలు, పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, ధాన్యం కొనుగోలు, అమ్మకాల్లో కమీషన్, ఇలా కమీషన్లు దండుకునే కార్యక్రమంలో ఉన్నారు. కడప లోని షిరిడీ సాయి ఎలక్ట్రికల్ కు 6,500 కోట్లు కట్టబెట్టచూస్తున్నారు. 

 జీవో 50 ని తెచ్చి రూ.3వేల కోట్లు స్వాహా చేశారు. 

 ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజల్ని నిలువునా మోసం చేశారు. మళ్లీ తనే ముఖ్యమంత్రి కావాలని చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.తెచ్చే అప్పులను పప్పు బెల్లాల్లా పంపిణీ చేస్తున్నారు. 

 సీబీఐ ఈడీ కేసుల నుండి తప్పించుకోవడానికి రాష్ట్రాన్ని పణంగా పెట్టారు.  వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ చేస్తున్న సీబీఐ  వేగాన్ని నియంత్రించారు. పెద్దల ప్రాపకం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతన్నారు. 

 మోటార్లకు మీటర్లు బిగిస్తే ఫోన్ కు ముందుగా రీచార్జ్ చేసుకున్నట్లు మోటార్లకు ముందుగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఆ మోటార్లు పని చేస్తాయి. 

 కంపెనీల కమీషన్ లకోసమే ఈ మోటార్లకు మీటర్లు.  

 అదానీ, అంబానీలు పెట్టబోయే సోలార్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ మోటార్లకు మీటర్లు. వారిని ప్రసన్నం చేసుకొని  ప్రజాధనం లూటీకే మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు. గంగవరం, కాకినాడ పోర్టులు, క్రిష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టులను ప్రైవేట్ కు అప్పగించే ప్రక్రియ సాగుతోంది. 

 కమీషన్లు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

 పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కలిసి పోరాడాలి. 

 వైసీపీకి ఓట్లేసిన వారికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు. 

 గ్రామాల్లో రోడ్లు సరిగా లేవు. వైసీపీ ప్రభుత్వం చేసే దుర్మా్ర్గపు ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతుంది. 

 విద్యుత్ రంగంలో రైతులకు నష్టదాయక సంస్కరణలు తెచ్చారు. ప్రతి రైతును నష్టపరుస్తున్నారు. ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా ఎదుర్కోవాలి. 

 ఎన్టీరామారావు అధికారంలోకి వచ్చేటప్పటికి  ఒక యూనిట్ విద్యుత్ 53 పైసలు ఉండగా రైతులు కట్టలేక ఇబ్బందులు పడేవారు.ఎన్టీరామారావు అది చూసి  విద్యుత్ బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న రైతులను కాపాడడానికి శ్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చారు. దీంతో రైతులకు ఎంతో మేలు జరిగింది.

 నదీ పరివాహక ప్రాజెక్టు ల వద్ద ఉన్న పొలాలన్నింటికి  నీరివ్వగలిగింది టీడీపీ.. జగన్ రైతుల ఆలోచనల్ని పక్కదారి పట్టించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 

 రైతుల పొలాల మోటార్లకు మీటర్లు బిగించడాన్ని విరమించుకోవాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం.  

 జగన్ ను సాగనంపడానికి రైతులు తమ వంతు ప్రయత్నం చేయాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image