రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
- వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్
- వరసగా నాలుగో ఏడాది, రెండో విడతగా..
- జిల్లాలోని 1,31,384 మంది రైతు ఖాతాల్లోకి రూ. 62.51 కోట్ల జమ..
..జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ
రైతు సంక్షేమమే లక్ష్యంగా వారి ఆర్థికంగా బలోపేతం చేందేందుకు దేశంలోనే ప్రప్రధమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రైతులకు ఆర్థిక భరోసాను కల్పించార
ని జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ రెండో విడత నగదు బదిలీ రైతులకు చెక్కు పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమం కలెక్టర్ డా కె. మాధవీలత అధ్యక్షతన వహించగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక యంపి మార్గాని భరత్ రామ్, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలోని 7 నియోజక వర్గాల పరిధిలోని 18 మండలాలకు చెందిన 1,31,384 మంది రైతు ఖాతాల్లోకి రూ. 62.51 కోట్ల మేర 2022-23 వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ రెండో విడత నగదు ను రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం జరిగిందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పంటల సాగుకయ్యే పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్ రైతు భరోసా, విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతులకు గ్రామంలో తమ గడప వద్దనే సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లిస్తుందన్నారు. రైతుల తరపున పూర్తి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని 87500 కోట్లు కోటయ్య కమిటీ ఏర్పాటు చేసిన సిపార్శులను పట్టింకోకుకండా ఆ మొత్తాన్ని 25 వేల కోట్లు తగ్గించి కేవలం రైతులకు 15 వేలకోట్లు మాత్రమే చెల్లించారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడు నేడు సీయం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ ఆరు మాసాల్లోనే రూ.24 వేల కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసి రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు మరింత మద్దతు ఇచ్చేలా ఈ ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందని తెలిపారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద 2022-23 మేనెలలో మొదటి విడతగా జిల్లా లో 1,21,955 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 91.46 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క రైతు భూ యజమాని ఈకేవైసీ చేయించుకోవడం ద్వారా ఆ పంట భద్రతకు భరోసా ఇవ్వగలుగుతారన్నారు.
పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ మాట్లాడుతూ .ప్రతి ఏటా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా – పియం కిసాన్ యోజన కింద రైతులు సాయం చేస్తు ఈ ప్రభుత్వం అండగా నిలిస్తుదన్నరు.
శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఏ సీజన్ కు ఆసీజన్ లోనే పంట నష్ట పరిహారం అందించి రైతులకు తదుపరి పంటకు ఎటవంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండగా నిలిచి రైతులు మరింతంగా ప్రయోజనం పొందాలని రైతులతో అన్నారు.
మండలాల వారీ వివరాలు :-
అనపర్తి మండలంలో 4205 మంది రైతులకు రూ. 1,93,06,000/-లు,బిక్కవోలు మండలంలో 6980 మంది రైతులకు రూ. 1,44,44,500/-లు,రంగంపేట మండలంలో 8869 మంది రైతులకు రూ. 1,18,76,500/-లు,రాజమహేంద్రవరం రూరల్ మండలంలో 1950 మంది రైతులకు రూ. 87,22,500/-లు,కడియం మండలంలో 5260 మంది రైతులకు రూ. 2,41,47,500/-లు,రాజానగరం మండలంలో 10739 మంది రైతులకు రూ. 4,64,17,500/-లు,కోరుకొండమండలంలో 10483 మంది రైతులకు రూ. 4,85,27,000/-లు,సీతానగరం మండలంలో 8280 మంది రైతులకు రూ. 4,10,11,500/-లు,గోకవరం మండలంలో 10420 మంది రైతులకు రూ. 6,43,14,000/-లు,దేవరపల్లి మండలంలో 7741 మంది రైతులకు రూ. 3,77,94,000/-లు,గోపాలపురం మండలంలో 8418 మంది రైతులకు రూ. 9,96,07,000/-లు,నల్లజర్ల మండలంలో 9784 మంది రైతులకురూ. 4,42,32,000/-లు,కొవ్వూరు మండలంలో 5923 మంది రైతులకు రూ. 2,75,37,000/-లు,చాగల్లు మండలంలో 5690 మంది రైతులకు రూ. 2,52,12,500/-లు,తాళ్లపూడి మండలంలో 5285మంది రైతులకు రూ. 2,47,31,000/-లు,ఉండ్రాజవరం మండలంలో 5499 మంది రైతులకు రూ. 2,59,50,000/-లు,నిడదవోలు మండలంలో 8689 మంది రైతులకు రూ. 3,93,08,500/-లు,పెరవలి మండలంలో 7169 మంది రైతులకు రూ. 3,19,97,000/-లు,జిల్లాలో మొత్తం 1,31,384 మంది రైతు ఖాతాల్లోకి రూ. 62,51,36,000 రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు జక్కంపూడి రాజా, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి వి. రాధాకృష్ణ, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు కంటే తేజా, స్థానిక నాయకులు జి. జనార్ధన రావు, రూరల్ చైర్మన్ సిహెచ్. కేశవ రామారావు, కే. ఆంజనేయులు, రైతులు, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదతరులు హాజరయ్యారు.
...............................
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.
రాజమహేంద్రవరం : తేదీ : 17.10.2022
వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద వరసగా నాలుగో ఏడాది, రెండో విడతగా జిల్లాలో 1,31,384 మంది రైతు ఖాతాల్లోకి రూ. 62.51 కోట్ల మేర
2022-23 వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద లబ్దిపొందిన తూర్పు గోదావరి జిల్లా రైతుల అభిప్రాయాలు .-
జిల్లా వ్యవసాయ మండలి సభ్యులు, బూరుగుపూడి గ్రామానికి చెందిన కంటే తేజ వారు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ రైతు భరోసా పధకాన్ని ప్రవేశ పెట్టి రైతుల ఆర్థికాభివృద్దికి ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన రెడ్డి కృషి హర్షనీయమన్నారు. మాట తప్పను, మడం తిప్పను అన్న మాట కు ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామాల్లోనే వ్యవసాయరంగంలో బావితరాలకు భవిష్యత్ టెక్నాలజి నూతన ఒరవడి శ్రీకారం అన్నారు.
తొర్రేడు గ్రామానికి చెందిన రైతు బత్తుపల్లి కేశవ రామారావు వారి అభిప్రాయం వ్యక్త పరుస్తూ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగు తొందన్నారు. వై. ఎస్. ఆర్. రైతు భరోసా పధకం ద్వారా సంవత్సరము లో 13,500 రూపాయలు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం హర్ష నీయమన్నారు.
హుక్కుంపేట కు చెందిన కురుమళ్ల ఆంజనేయులు వారి అభిప్రాయం వ్యక్త పరుస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పంటల సాగుకయ్యే పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్ రైతు భరోసా, విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతులకు గ్రామాల్లో తమ గడప వద్దనే సేవలందించడం హర్షనియమన్నారు. రైతులను ఆదుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసు కోవడం అభినందనీయమన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లిస్తుందన్నారు. రైతుల తరపున పూర్తి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఏ సీజ న్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ లో ముగిసేలోగా ఇన్‌పు ట్ సబ్సిడీ ప్రభుత్వం అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
addComments
Post a Comment