గుడివాడ పట్టణంలో ఘనంగా శిష్ట్లా లోహిత్ పుట్టినరోజు వేడుకలు




 *- గుడివాడ పట్టణంలో ఘనంగా శిష్ట్లా లోహిత్ పుట్టినరోజు వేడుకలు


 *- శాంతి వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం* 

*- గుడివాడ రాజకీయాల్లో శిష్ట్లా కుటుంబానికి ప్రత్యేక స్థానం* 

 *- టీడీపీ సీనియర్ నేత తంగిరాల మోహన్ దాస్* 


గుడివాడ, అక్టోబర్ 8 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ పుట్టినరోజు వేడుకలను గుడివాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శనివారం గుడివాడ-కంకిపాడు రోడ్డులోని బేతవోలులో ఉన్న శాంతి వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. ముందుగా వృద్ధుల సమక్షంలో టీడీపీ సీనియర్ నేత తంగిరాల మోహన్ దాస్ కేక్ ను కట్ చేశారు. బాణాసంచా కాల్చారు. శిష్ట్లా లోహిత్ కు పలువురు పట్టణ ప్రముఖులు, వృద్ధులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తంగిరాల మోహన్ దాస్ విలేఖర్లతో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో శిష్ట్లా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. గత 30 ఏళ్ళుగా శిష్ట్లా లోహిత్ తండ్రి శిష్టా రమేష్ గుడివాడ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారన్నారు. శిష్ట్లా రమేష్ ఎంతో కాలంగా రాజకీయంగా ప్రజలకు సేవలందిస్తూనే తన తండ్రి శిష్ట్లా సీతారామాంజనేయశాస్త్రి పేరుతో శిష్ట్లా ఫౌండేషన్ ను నెలకొల్పారని తెలిపారు. ఫౌండేషన్ ద్వారా పేదప్రజలను ఆదుకున్నారని గుర్తుచేశారు. ముఖ్యంగా ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వడ్డీరహిత రుణాలను కూడా ప్రజలకు అందించారన్నారు. గుడివాడ ప్రాంత ప్రజల గుండెల్లో శిష్ట్లా కుటుంబం చెరగని ముద్ర వేసుకుందన్నారు. అటువంటి కుటుంబం నుండి వచ్చిన శిష్ట్లా లోహిత్ కు దేవుడు మంచి రాజకీయ భవిష్యత్తును ప్రసాదించాలన్నారు. రాజకీయాల్లో అనేక పదవులను చేపట్టి అన్నివర్గాల ప్రజల మన్ననలు పొందాలన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ పుట్టినరోజు సందర్భంగా గుడివాడ పట్టణంలోని బేతవోలులో ఉన్న శాంతి వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. శిష్ట్లా లోహిత్ పుట్టినరోజు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆకాంక్షించారు. దేవుని దయలో ఆయన వర్ధిల్లాలని కోరుకున్నారు. గుడివాడ పట్టణంలో ప్రజాదరణ, ప్రజల ప్రేమను పొందే రీతిలో శిష్ట్లా లోహిత్ కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులతో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందాలని దేవుడిని ప్రార్థించారు. రాజకీయంగా దినదినాభివృద్ధి చెందుతూ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల మేలు కోరుకునే నాయకుడిగా ఎదగాలన్నారు. శిష్ట్లా లోహిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని తంగిరాల మోహన్ దాస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శిష్ట్లా కుటుంబ సభ్యులు శిష్ట్లా బలరామకృష్ణ, శిష్ట్లా పూర్ణచంద్రరావు, కౌండిన్య మిత్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కట్టా కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments